Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

Pakistan SC Verdict: పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని స్పష్టంచేసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం..

Pakistan Political Crisis: మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలి.. ఇమ్రాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
Pakistan Sc Verdict Imran K
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 07, 2022 | 9:58 PM

పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు(Pakistan Supreme Court) షాకిచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చడం సరికాదని స్పష్టంచేసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం తీర్పిచ్చింది. రద్దయిన పార్లమెంట్‌ను తిరిగి పునరుద్ధరించి.. అవిశ్వాసంపై మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎల్లుండి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు ఇమ్రాన్‌ఖాన్. సంక్షోభంలో ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడానికి డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న చర్య చట్టబద్ధతకు సంబంధించిన ముఖ్యమైన అంశంపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు తన తీర్పును ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

ఏప్రిల్ 9 ఉదయం 10 గంటలకు నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. తీర్పు అనంతరం కోర్టు బయట గో నియాజీ, గో నినాదాలు మిన్నంటాయి. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోతే, విపక్షాలు కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏ సభ్యుడిని ఓటు వేయకుండా ఆపబోమని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో విపక్షాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద విజయం అని బిలావల్ భుట్టో అన్నారు.

సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టులో తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ ఎజాజ్-ఉల్ అహ్సన్, జస్టిస్ మజర్ ఆలం ఖాన్ మియాంఖైల్, జస్టిస్ మునీబ్ అక్తర్, జస్టిస్ జమాల్ ఖాన్ మండోఖైల్ ఉన్నారు. ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది.

తీర్పు వెలువడే ముందు ఇమ్రాన్ ఖాన్ ఏ నిర్ణయం వచ్చినా అంగీకరిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు ఎన్నికల సంఘం బృందాన్ని కూడా పిలిపించింది. త్వరలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషనర్ బృందం తెలిపింది. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు ఫవాద్ చౌదరి మాట్లాడుతూ.. ఏం జరిగినా చివరకు ఎన్నికలు జరగాల్సిందేనని అన్నారు. తీర్పు వెలువడకముందే సుప్రీంకోర్టు వెలుపల భద్రతను పెంచడంతోపాటు సుప్రీంకోర్టు బయట కూడా ప్రజల మధ్య గొడవ జరగడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి: Viral Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబు… దెయ్యంతో డ్యాన్సేంటి.. వీడియో చూస్తే షాక్

Viral Video: కుక్కను కాకా పడుతున్న పిల్లి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..