Donald Trump: ట్రంప్ మరణించాడంటూ ట్వీట్ వైరల్.. కుమారుడి అకౌంట్ నుంచే పోస్ట్. అసలేం జరిగిందంటే..
డొనాల్డ్ ట్రంమ్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్‌లో అకౌంట్‌లో సెప్టెంబర్ 20వ తేదీన ఓ ట్వీట్ పోస్ట్ అయింది. 'మా నాన్న డొనాల్డ్ ట్రంప్ మరణించారని తెలియజేయడానికి బాధగా ఉంది. 2024 అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో నేను పోటీ చేయనున్నాను' అని సదరు ట్వీట్‌లో ఉంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంమ్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ అయిన ఓ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేసినట్లున్న ఈ ట్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ మరణించాడంటూ పోస్ట్ చేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ట్రంప్ చనిపోవడం ఏంటి.? ఆయన కుమారుడు అసలు ఈ ట్వీట్ ఎందుకు చేశాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
డొనాల్డ్ ట్రంమ్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్‌లో అకౌంట్‌లో సెప్టెంబర్ 20వ తేదీన ఓ ట్వీట్ పోస్ట్ అయింది. ‘మా నాన్న డొనాల్డ్ ట్రంప్ మరణించారని తెలియజేయడానికి బాధగా ఉంది. 2024 అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో నేను పోటీ చేయనున్నాను’ అని సదరు ట్వీట్‌లో ఉంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ఏంటి.? మరణించడం ఏంటని? ఆశ్చర్యపోయారు. ఈ ట్వీట్ కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలు స్పందించారు. అయితే ఈ ట్వీట్‌లో ఎలాంటి నిజం లేదని ఆ వార్త తెలిసింది.
డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కి గురైనట్లు తర్వాత గుర్తించారు. హ్యాకర్లు కావాలనే ఈ పోస్టును చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మరణ వార్తపై తానే స్వయంగా స్పందించారు. ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ తన రణ వార్తను పుకారుగా కొట్టి పడేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైనట్లు తెలియగానే ఆయన టెక్నికల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.
వెంటనే పోస్టులను తొలగించారు. అనంతరం ట్విట్టర్ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేశారు. అయితే ట్రంప్ మరణించినట్లు పోస్ట్ అయిన ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఈ ట్వీట్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారి తీసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..