China – Taiwan: తైవాన్ దిశగా చైనా దూకుడు..! 24 గంటల్లో 103 యుద్ధవిమానాలు..
తైవాన్ తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా .. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపింది. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు.
తైవాన్ తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా .. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్ దిశగా పంపింది. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్య అని పేర్కొన్న తైవాన్.. ఆ వ్యవధిలో తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణించిన తైవాన్ రక్షణశాఖ.. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో ఇటువంటి మిలిటరీ విన్యాసాలతో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తరహా ఘటనలకు బాధ్యత వహించడంతోపాటు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని సూచించింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని అన్నారు. గత వారం సైతం చైనా, తైవాన్ సమీప జలాల్లోకి విమాన వాహక నౌక షాన్‌డాంగ్ సహా యుద్ధనౌకల దండును పంపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

