కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!
దగ్గినందుకు జైలుపాలైన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. అది కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి ఈ శిక్ష పడింది. మామూలు టైంలో దగ్గితే అంతా లైట్ తీసుకుంటారు గానీ, కరోనా టైంలో దగ్గితే ఊరుకుంటారా .. అదికూడా పాజిటివ్ వ్యక్తి అందరి మధ్యా దర్జాగా తిరుగుతూ దగ్గుడు షురూ చేసిండట. ఇంకేముంది మెల్లిగా తీసుకెళ్లి కటకటాలు లెక్కపెట్టిచ్చినరు. సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల తమిళసెల్వం
దగ్గినందుకు జైలుపాలైన ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. అది కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి ఈ శిక్ష పడింది. మామూలు టైంలో దగ్గితే అంతా లైట్ తీసుకుంటారు గానీ, కరోనా టైంలో దగ్గితే ఊరుకుంటారా .. అదికూడా పాజిటివ్ వ్యక్తి అందరి మధ్యా దర్జాగా తిరుగుతూ దగ్గుడు షురూ చేసిండట. ఇంకేముంది మెల్లిగా తీసుకెళ్లి కటకటాలు లెక్కపెట్టిచ్చినరు. సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన 64 సంవత్సరాల తమిళసెల్వం అనే వ్యక్తి కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండువారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సదరు వ్యక్తి కరోనా నిబంధనలు పాటించకుండా.. సహోద్యోగులను ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అతనికి అక్టోబర్ 18, 2021న ఆరోగ్యం బాగలేకపోవడంతో కరోనా టెస్టులు చేశారు. పరీక్షలు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే, అతను ఇంటికి వెళ్లకుండా సమాచారాన్ని తెలిపేందుకు లాజిస్టిక్ కార్యాలయానికి చేరుకోగా.. తమిళ సెల్వంను వెళ్లిపోవాలని సూచించారు. అయితే, కరోనా సోకినా ఇంటికి దగ్గుతూ అక్కడే తిరిగాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సహోద్యోగులు ఇబ్బందికి గురయ్యారు. ఇందులో ఓ తోటి ఉద్యోగి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయితే, ఘటన తర్వాత ఎవరికీ కరోనా సోకలేదు కానీ.. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: