ల్యాండింగ్‌కు ముందే డోర్ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణిలు ఇష్టవచ్చినట్టు ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు, విమాన సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఇండిగో విమానం 6E 6341 సెప్టెంబర్ 19 రాత్రి దిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది.
ఇటీవల విమానాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణిలు ఇష్టవచ్చినట్టు ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు, విమాన సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఇండిగో విమానం 6E 6341 సెప్టెంబర్ 19 రాత్రి దిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. విమానం డోర్ తెరిచే ప్రయత్నం చేసిన వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. విమానం చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే సదురు వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించారు. విమానంలో జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలను ఎయిర్‌లైన్స్ అధికారులు సీఐఎస్‌ఎఫ్‌కు వివరించారు. ఇండిగో ఎయిర్‌లైన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

