Onion Record: రికార్డ్ సృష్టించిన ఉల్లిగడ్డ.. బరువు తెలిస్తే షాక్.! వీడియో వైరల్..

Onion Record: రికార్డ్ సృష్టించిన ఉల్లిగడ్డ.. బరువు తెలిస్తే షాక్.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Sep 21, 2023 | 7:59 AM

మన దగ్గర ఉల్లిగడ్డ ఒక్కటి ఎంత బరువు ఉంటుంది? మహా అయితే 100 గ్రాములు లేదా 200 గ్రాములు. కానీ, బ్రిటన్ కు చెందిన ఓ రైతు ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించి సంచలనం సృష్టించాడు. గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ ఈ భారీ ఉల్లిపాయ ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో దీన్ని ప్రదర్శించాడు. ఇది ప్రపంచ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది.

మన దగ్గర ఉల్లిగడ్డ ఒక్కటి ఎంత బరువు ఉంటుంది? మహా అయితే 100 గ్రాములు లేదా 200 గ్రాములు. కానీ, బ్రిటన్ కు చెందిన ఓ రైతు ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించి సంచలనం సృష్టించాడు. గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ ఈ భారీ ఉల్లిపాయ ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో దీన్ని ప్రదర్శించాడు. ఇది ప్రపంచ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఇది అద్భుతమని, భారీ ఉల్లిగడ్డ అని యూజర్లు స్పందిస్తున్నారు. ఈ ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు ఉండగా, పొడవు 21 అంగుళాలు. రికార్డును బ్రేక్ చేయడానికి 12 ఏళ్లుగా గ్రిఫిన్ చేస్తున్న ప్రయత్నం ఈ సారి ఫలితాన్నిచ్చింది. అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలతో అతడు ఇంత పెద్ద ఉల్లిగడ్డను పండించాడు. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించాల్సి ఉంది. గ్రిఫిన్ తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసే వారు. ఈ భారీ సైజు ఉల్లిగడ్డలు సైతం వంట చేసుకోతగినవేనని, రుచి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందంటున్నారు గ్రిఫిన్. సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 21, 2023 07:59 AM