Viral: రెడ్ హ్యాండెడ్‌గా దొరికి.. రానంటూ చిన్నపిల్లడిలా మారాం చేసిన అధికారి..! వీడియో వైరల్..

Viral: రెడ్ హ్యాండెడ్‌గా దొరికి.. రానంటూ చిన్నపిల్లడిలా మారాం చేసిన అధికారి..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Sep 20, 2023 | 8:52 PM

ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక్కడే ఆ అవినీతి అధికారి తన స్టైల్ చూపించాడు. తాను రానంటూ మొండికేశాడు. అచ్చం చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లేటపుడు ఎలా అయితే మారాం చేస్తారో అలాగే చేశాడు. దీంతో రాకపోతే ఎలాగైనా తీసుకెళ్తామని చెప్పిన అధికారులు చివరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.

ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక్కడే ఆ అవినీతి అధికారి తన స్టైల్ చూపించాడు. తాను రానంటూ మొండికేశాడు. అచ్చం చిన్నపిల్లలు స్కూలుకు వెళ్లేటపుడు ఎలా అయితే మారాం చేస్తారో అలాగే చేశాడు. దీంతో రాకపోతే ఎలాగైనా తీసుకెళ్తామని చెప్పిన అధికారులు చివరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో పరిధిలోని సదర్ తహసీల్‌లో అవినాష్ ఓజా అనే రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికాడు. ఓ రైతుకు సంబంధించిన భూమిని కొలిచేందుకు అతని నుంచి 10 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత అవినాష్ ఓజాను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు అవినాష్ ఓజా ససేమిరా అనడంతో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అధికారులు అతడ్ని తీసుకెళ్తుంటే కింద కూర్చోవడం, వెనక్కి వెనక్కి వెళ్లిపోవడం, వెళ్లడానికి నిరాకరించడం చేశారు. చిన్నపిల్లాడిలా రాను అంటూ మారాం చేశాడు. దీంతో విసిగిపోయిన అధికారులు.. బలవంతంగా అవినాష్ ఓజాను అక్కడి నుంచి తరలించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారులోకి ఎక్కించారు. అయితే అవినాష్ ఓజా ఇటీవలే రాయ్‌బరేలీ నుండి లక్నో తహసీల్ సదర్‌కు బదిలీ అయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..