Marijuana Smuggling: పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్.. పోలీస్ చేజింగ్.. తీరా చూస్తే షాక్..!

Marijuana Smuggling: పుష్ప స్టైల్‌లో గంజాయి స్మగ్లింగ్.. పోలీస్ చేజింగ్.. తీరా చూస్తే షాక్..!

Anil kumar poka

|

Updated on: Sep 21, 2023 | 8:13 AM

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బ‌రితెగించారు. పోలీసులు క‌ళ్లు గ‌ప్పి త‌ప్పించుకోవాల‌ని పుష్ప స్టైల్ లో ప్లాన్ చేశారు. పారిపోతూ.. నడుస్తున్న వాహనం నుంచే పోలీసు వాహనానికి అడ్డంగా.. గంజాయి బస్తాలను రోడ్డుపై పడేశారు. హై స్పీడ్ లో పారిపోతున్న స్మగ్లర్లు పోలీసులకే చుక్కలు చూపించారు. చివ‌రికి గంజాయిని వ‌దిలి స్మగ్లర్లు ప‌రార‌య్యారు. సినిమా ఫ‌క్కీలో సాగిన ఈ చేజింగ్ లో రెండు వాహనాలతో గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో గంజాయి స్మగ్లర్లు బ‌రితెగించారు. పోలీసులు క‌ళ్లు గ‌ప్పి త‌ప్పించుకోవాల‌ని పుష్ప స్టైల్ లో ప్లాన్ చేశారు. పారిపోతూ.. నడుస్తున్న వాహనం నుంచే పోలీసు వాహనానికి అడ్డంగా.. గంజాయి బస్తాలను రోడ్డుపై పడేశారు. హై స్పీడ్ లో పారిపోతున్న స్మగ్లర్లు పోలీసులకే చుక్కలు చూపించారు. చివ‌రికి గంజాయిని వ‌దిలి స్మగ్లర్లు ప‌రార‌య్యారు. సినిమా ఫ‌క్కీలో సాగిన ఈ చేజింగ్ లో రెండు వాహనాలతో గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. చిత్రకొండ బ్లాక్ పడ్ ఫాదర్ పంచాయితీ రేకపల్లి గ్రామంలో స్మగ్లర్లు గంజాయి కొనుగోలు చేసి బొలెరో వాహనంలో లోడ్ చేశారు. ఏపీ 07 టి కే 0466 రిజిస్టర్ నెంబర్ గల వాహనంలో తరలించడానికి సిద్ధం చేశారు. ఈలోగా చిత్రకొండ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తుండ‌గా బొలోరో పిక‌ప్ వాహ‌నం వేగంగా రావ‌డాన్ని గుర్తించారు. దాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయ‌త్నిస్తుండగానే.. స్పీడ్‌గా ముందుకు దూసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న చిత్రకొండ పోలీసులు వాహ‌నాన్ని వెంబ‌డించి ఛేజ్ చేశారు. అయితే స్మగ్లర్లు వాహ‌నంను ఆప‌కుండా అందులోని గంజాయి బ్యాగుల‌ను ర‌హ‌దారిపై ప‌డేశారు. వాటిని తప్పించుకుంటూ హై స్పీడ్ లో వెంబ‌డించిన పోలీసులు వాహ‌నాన్ని దారాలమ్మ ఘాట్ రోడ్లో ప‌ట్టుకున్నారు. అయితే స్మగ్లర్లు మాత్రం పోలీసుల‌ను త‌ప్పించుకుని పారిపోయారు. ఈ గంజాయి వాహ‌నం చేజింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రెండు వాహనాలతో 900 కిలోలకు పైగా గంజాయి సీజ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..