సత్య నాదెళ్ల చాట్… దేశంలో ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది… పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి…

ఆరోగ్యం, ప్రభుత్వం, విద్య, సేవా, తయారీ రంగాల్లో టెక్నాలజీ సాయంతో కొత్త మార్పులు తీసుకురావచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

సత్య నాదెళ్ల చాట్... దేశంలో ఆ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది... పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలి...
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2020 | 9:08 PM

ఆరోగ్యం, ప్రభుత్వం, విద్య, సేవా, తయారీ రంగాల్లో టెక్నాలజీ సాయంతో కొత్త మార్పులు తీసుకురావచ్చని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షురాలు డాక్టర్ సంగీతా‌రెడ్డితో ఆయన ఫైర్సైడ్ చాట్లో మాట్లాడారు.

డిజిటల్ టెక్నాలజీ చుట్టూ మైక్రోసాఫ్ట్ మౌలిక కార్యకలాపాలు, సదుపాయాలు కల్పిస్తామని సత్య నాదెళ్ల తెలిపారు. భారత్లో మొబైల్ ఫోన్ రంగం వేగంగా, గొప్పగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ విధమైన పురోగతి అందరిలో ఉండాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలు కూడా ఒకదానికొకటి సహకరించుకుంటే ఆర్థిక పురోగతి సాధించగలమని అన్నారు. ప్రతి ఒక్కరిలో నాయకత్వ లక్షణాలు, పని చేసే సామర్థ్యాలను నింపే ప్రయత్నం చేయాలని సూచించారు. కరోనా కాలంలో సాంకేతికత మనుషుల జీవనానికి ఎంతో తోడ్పడిందని అన్నారు.