AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుది దశకు చేరుకుంటున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ఆక్స్‌ఫర్డ్‌, స్పుత్నిక్‌ సంస్థలు

ప్రపంచాన్ని వణికిస్తున్న భూతాన్ని తరిమికొట్టేందుకు ఔషధ కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా వ్యాక్సిన్‌ తయారీ కోసం వివిధ సంస్థలు రకరకాలు ప్రయోగాలు చేస్తున్నాయి.

తుది దశకు చేరుకుంటున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ఆక్స్‌ఫర్డ్‌, స్పుత్నిక్‌  సంస్థలు
Balaraju Goud
|

Updated on: Dec 13, 2020 | 5:53 AM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న భూతాన్ని తరిమికొట్టేందుకు ఔషధ కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొవిడ్‌-19 కట్టడిలో భాగంగా వ్యాక్సిన్‌ తయారీ కోసం వివిధ సంస్థలు రకరకాలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు వేర్వేరుగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించిన సంస్థలు ఇప్పుడు రెండు వ్యాక్సిన్లను కలిపి ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌, స్పుత్నిక్‌ టీకాలను కలిపి క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని బ్రిటన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి మరింత రక్షణ కల్పించేదిశగా ప్రయోగాలు చేయాలని ఆక్స్‌ఫర్డ్‌, స్పుత్నిక్‌ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. రెండు సంస్థలకు చెందిన ఈ రెండు వ్యాక్సిన్లను కలిపి ఇవ్వనున్నారు. ఎడినోవైరస్‌ ఆధారంగా ఈ టీకాలను రూపొందించిన సంగతి తెలిసిందే. వేర్వేరు టీకాలు కలిపి ఇచ్చినప్పుడు రోగనిరోధక శక్తి స్పందన మరింత మెరుగ్గా ఉంటుందని ది టైమ్స్‌ పేర్కొంది. రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ను ఆక్స్‌ఫర్డ్‌తో కలిపి ఇచ్చేందుకు ఆస్ట్రాజెనికా అంగీకరించిందని ఆ వార్తా సంస్థ తెలిపింది.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి పోటీలో అందరికన్నా ముందుగా రష్యాకు చెందిన స్పుత్నిక్‌ ప్రకటించుకుంది. ఈ వ్యాక్సిన్ ద్వారా 90% సామర్థ్యంతో పనిచేస్తుందని ట్రయల్స్‌ ఫలితాల్లో తేలిందని ఆ సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ను రెండు చోట్ల పరిశీలించగా ఒకచోట 62%, మరోచోట 90% సమర్థంగా పనిచేసిందని చెప్పుకొచ్చింది. ఇక, ‘వ్యాక్సిన్‌ సహకారంలో కొత్త అధ్యాయం ఈ రోజే మొదలైంది. మేం చేసిన ప్రతిపాదనను ఆస్ట్రాజెనికా అంగీకరించింది’ అని స్పుత్నిక్‌ ట్వీట్‌ చేసింది. కరోనా వైరస్‌ నుంచి మరింత రక్షణ కల్పించడంలో వేర్వేరు టీకాలను కలిపి ఇవ్వడం కీలకమైన ముందడుగని తెలిపింది. రెండు వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా మరింత రోగనిరోధక శక్తి పెరిగి, కరోనా వైరస్‌ను తరిమికొట్టవచ్చని అభిప్రాయపడింది.

Follow Us
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.40 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.40 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
ఎండాకాలంలో బాడీకి కూలింగ్ ఇచ్చే పుచ్చకాయ రైస్ రెసిపీ
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
అంతుచిక్కని అద్భుతాలకు నిలయం.. శ్రీరంగం టెంపుల్ మిస్టరీ..
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం
ఓరి దేవుడో.. మీ ఇంట్లోని సబ్బులు, షాంపూలే మీకు శత్రువులా..ఈ విషయం