Indonesia Earth Quake: ఇండోనేషియాలో ఊహకందని విషాదం.. భూకంపం ఘటనలో 162కి చేరిన మృతుల సంఖ్య..

ఇండోనేషియాలో ఊహకందని విషాదం చోటుచేసుకుంది. భారీ భూకంపం ధాటికి ఏకంగా 162 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఇది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో

Indonesia Earth Quake: ఇండోనేషియాలో ఊహకందని విషాదం.. భూకంపం ఘటనలో 162కి చేరిన మృతుల సంఖ్య..
Earthquake
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 22, 2022 | 5:43 AM

ఇండోనేషియాలో ఊహకందని విషాదం చోటుచేసుకుంది. భారీ భూకంపం ధాటికి ఏకంగా 162 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఇది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సోమవారం నాడు భూకంపం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ భూకంపం దేశంలోని ఎన్నో దీపాలను ఆర్పేసింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో ఏర్పడిన కంపించిన భూమి.. అమాయక ప్రజలను తనలో కలిపేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 162 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదేశ అధికారులు ప్రకటించారు. మరో 326 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వందలాది మంది క్షతగాత్రులు ఆసుపత్రుల లోపల, బయట చికిత్స తీసుకుంటున్నారు. వారిలో ఎంత మంది ప్రాణాలతో బయటపడతారో.. మృతుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. ఈ ఘటనతో దేశంలో ఎక్కడ చూసినా విషాదఛాయలే అలుముకున్నాయి.

పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. ఒక్కసారిగా భారీ ప్రకంపలు రావడంతో ఆఫీసులు, ఇళ్లలో నుంచి జనాలు బయటకు పరుగులు పెట్టారు. కానీ భూ ప్రకంపనల తీవ్రతకు చాలా బిల్డింగ్‌లు నేలకూలాయి. మరికొన్ని బీటలు వారాయి. వాటి శిథిలాల కింద పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

పశ్చిమ ఇండోనేషియాలో గత శుక్రవారం రాత్రి కూడా భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.9గా నమోదైనా పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. కానీ సోమవారం వచ్చిన భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..