Elon Musk: అసలు సీక్రెట్ ఇదేనంటూ ఎలన్ మస్క్ ట్వీట్.! మరోసారి వార్తల్లో నిలిచిన మస్క్..
ట్విట్టర్ కొనుగోలు చేశాక తరచూ వార్తల్లో నిలుస్తున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి సంచలనమయ్యారు. ఈసారి విమర్శల స్థానంలో మస్క్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ట్విట్టర్ కొనుగోలు చేశాక తరచూ వార్తల్లో నిలుస్తున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి సంచలనమయ్యారు. ఈసారి విమర్శల స్థానంలో మస్క్ పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. గతంలో కాస్త లావుగా ఉన్న మస్క్ ఇటీవల స్లిమ్ గా, ఫిట్ గా మారిపోయారు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ ట్విట్టర్ యూజర్ ‘ఇప్పుడే చాలా ఫిట్ గా కన్పిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. జవాబుగా 13 కిలోల బరువు తగ్గానని మస్క్ ట్వీట్ చేశారు. బరువు ఎలా తగ్గారని మరో యూజర్ ప్రశ్నించగా.. ఓ స్నేహితుడి సలహాతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానన్నారు. ఇందుకోసం ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు తనకు చాలా ఇష్టమైన ఆహార పదార్థాల జోలికి వెళ్లలేదని మస్క్ చెప్పుకొచ్చారు. వీటితో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకున్నానని ఎలాన్ మస్క్ చెప్పారు. బరువు తగ్గాక మరింత చురుకుగా, మరింత ఆరోగ్యంగా ఉంటున్నానని మస్క్ ట్వీట్ చేశారు. కాగా, మస్క్ బరువు తగ్గడంపై ట్విట్టర్ యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

