Covid-19 Vaccinations Countries: ఏఏ దేశాల్లో వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది..? ఎంత మందికి టీకా అందించారు..?

Covid-19 Vaccinations Countries: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా క‌ట్ట‌డి క‌లేక‌పోతోంది.....

Covid-19 Vaccinations Countries: ఏఏ దేశాల్లో వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది..? ఎంత మందికి టీకా అందించారు..?
Follow us

|

Updated on: Jan 02, 2021 | 5:09 PM

Covid-19 Vaccinations Countries: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా క‌ట్ట‌డి క‌లేక‌పోతోంది. వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు భార‌త్‌తో పాటు చాలా దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ప‌లు దేశాలు ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాయి. తాజాగా భార‌త్‌లో వ్యాక్సిన్‌కు అనుమ‌తి ల‌భించ‌గా, ప‌లు దేశాల్లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అయితే వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఏఏ దేశాల్లో ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మైంది, దాని సామ‌ర్థ్యం ఎంతో వ్యాక్సిన్ త‌యారు చేసిన సంస్థ‌లు వెల్ల‌డించాయి.

బ్రిట‌న్‌

ఇక్క‌డ వ్యాక్సినేష‌న్ డిసెంబ‌ర్ 8న ప్రారంభ‌మైంది. 9,50,000 మందికి టీకా అందించారు. తాజాగా ఆమోదించిన ఆస్ట్రాజెనెక్ వ్యాక్సిన్ జ‌న‌వ‌రి 4న అందుబాటులోకి తీసుకురానున్నారు.

ర‌ష్యా

ఈ దేశంలో వ్యాక్సినేష‌న్ డిసెంబ‌ర్‌లోనే ప్రారంభ‌మైంది. ఈ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌వి వ్యాక్సిన్‌కు బెలార‌స్‌, ఆర్జెంటీనా దేశాలు కూడా ఆమోదం తెలిపాయి. ఈ వ్యాక్సిన్ సామర్థ్యం 91.40 శాతం

చైనా

ఇక్క‌డ వేస‌వి కాలంలోనే వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. 50 ల‌క్ష‌ల మందికి ఇప్ప‌టికే టీకాను అందించారు. సినోఫార్మ్ వ్యాక్సిన్ 79 శాతం సామ‌ర్థ్యంతో క‌లిగి ఉంది.

అమెరికా, కెన‌డా

ఈ దేశాల్లో వ్యాక్సినేష‌న్ డిసెంబ‌ర్ 14న ప్రారంభ‌మైంది. ఇక్క‌డ పైజ‌ర్‌, మొడెర్నా వ్యాక్సిన్ల‌కు అనుమ‌తులు ల‌భించాయి. అమెరికాలో ఇప్ప‌టికే 28 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తియింది.

యూర‌ప్ దేశాలు

అత్య‌ధికంగా యూర‌ప్ దేశాలు డిసెంబ‌ర్‌లోనే వ్యాక్సినేష‌న్ ప్రారంభించాయి. జ‌ర్మ‌నీలో అత్య‌ధికంగా 1,30,000 మందికి ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ పూర్త‌యింది. అన్ని దేశాలు పైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్ల‌నే వాడుతున్నాయి.

గల్ఫ్‌ దేశాలు

యూఏఈలో డిసెంబ‌ర్ 14న సినోఫార్మ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. దుబాయ్‌లో పైజ‌ర్ వ్యాక్సిన్‌తో డిసెంబ‌ర్ 23న ప్రారంభం కాగా, సౌదీ ఆరేబియా, బ‌హ్రెయిన్‌లో డిసెంబ‌ర్ 17 నుంచి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా, డిసెంబ‌ర్ 23న ఖ‌త‌ర్‌లో, 24న కువైట్‌లో, 27న ఒమ‌న్‌లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. ఇజ్రాయెల్‌లో డిసెంబ‌ర్ 19న ప్రారంభ‌మైన‌ప్ప‌టికే 8 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింది.

దేశాల వారీగా వ్యాక్సిన్ల ఆర్డర్లు..

కాగా, వ్యాక్సిన్‌ను ముంద‌స్తుగానే కొన్ని దేశాలు ఆర్డ‌ర్ చేసుకున్నాయి.అమెరికా 240 కోట్ల డోసులు, యూరోపియ‌న్ యూనియ‌న్ 206.5 కోట్ల డోసులు, బ్రిట‌న్ 38 కోట్ల డోసులు, కెన‌డా 33.8 కోట్ల డోసులు, ఇండోనేషియా 32.8 కోట్ల డోసులు, చైనా 30 కోట్ల డోసులు, జ‌పాన్ 29 కోట్ల డోసులు వ్యాక్సిన్ల‌ను ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్నాయి.

ప్ర‌పంచ జ‌నాభాలో ధ‌నిక దేశాల పాపులేష‌న్ 13 శాతం కాగా, 50 శాతం వ్యాక్సిన్ డోసుల‌ను ఆయా దేశాలు ప్రీ బుకింగ్ చేసుకున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. ధ‌నిక దేశాలు మొద‌లు పెట్టిన వ్యాక్సిన్ ప్రీ ఆర్డ‌ర్ కార‌ణంగా వ్యాక్సిన్ ధ‌ర‌లు పెరిగి ఆ ప్ర‌భావం పేద దేశాల‌పై ప‌డుతుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ కార‌ణంగా ప్ర‌పంచంలోని పేద దేశాల‌న్నింటికీ క‌లిపి కేవ‌లం 320 కోట్ల డోసులను కేటాయించారు.