AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి అమెరికాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 7 రోజుల్లో 350 మరణాలు!

రీఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్‌ను లైట్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. తాజాగా అమెరికాలో రూపుమార్చుకున్న కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ సంఖ్య మునుపటి కంటే తక్కువగా ఉందని పేర్కొంది.

మరోసారి అమెరికాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 7 రోజుల్లో 350 మరణాలు!
Corona America
Balaraju Goud
|

Updated on: May 27, 2025 | 4:09 PM

Share

కరోనా రీఎంట్రీ కలకలం రేపుతోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇటు భారత్ పాటు అమెరికాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనా ధాటికి గత వారం రోజుల్లో వందలాది మందిని ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పరిస్థితి మునుపటిలా దారుణంగా లేనప్పటికీ, కరోనా పూర్తిగా పోలేదని ఖచ్చితంగా స్పష్టమైంది. గత కొన్ని వారాలుగా మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కొవిడ్‌-19 మళ్లీ డేంజర్‌బెల్స్‌ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 430కి పెరిగిన యాక్టివ్‌ కేసులు. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83.. తమిళనాడులో 69, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 11 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా.. నోయిడాలో 9 కరోనా కేసులు రికార్డ్‌ అయ్యాయి. గణాంకాలే కాదు, కరోనా మరణాలు కూడా మరోసారి భయాన్ని పెంచాయి. ఇప్పటివరకు 7 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మరణానికి కారణం కరోనా లేదా మరేదైనా వ్యాధి కాదా అనేది స్పష్టంగా లేదు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్‌ చేసింది. ముందు జాగ్రత్తగా ఆస్పత్రులు సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే.. ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువమంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. అదేవిధంగా, థాయిలాండ్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది, ఇక్కడ కేవలం ఒక వారంలోనే 50 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, అమెరికాలో కరోనా ఇప్పటికీ ప్రాణాలను బలిగొంటోంది. గత వారం 350 మంది అమెరికన్లు కోవిడ్-19 కారణంగా మరణించారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ సంఖ్య మునుపటి కంటే తక్కువగా ఉంది. కానీ ఆందోళన కొనసాగుతోంది. NB.1.8.1 అనే కొత్త సబ్-వేరియంట్ అమెరికా, సింగపూర్, హాంకాంగ్‌లతో సహా ఆసియాలో విస్తరిస్తోంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ వైవిధ్యమైన వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అయినప్పటికీ దాని తీవ్రత గురించి పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

అమెరికాలో కేవలం 23% పెద్దలు మాత్రమే బుస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలలో ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. కేవలం 13% మాత్రమే. టీకాలు వేయకపోవడం, కాలక్రమేణా రోగనిరోధక శక్తి బలహీనపడటం రెండూ ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందువల్ల, 65 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఆరు నెలలకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

మరో ప్రధాన కారణం ఏమిటంటే, పరిస్థితి మరింత దిగజారే వరకు ప్రజలు చికిత్స తీసుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. మోల్నుపిరవిర్ (మెర్క్), పాక్లోవిడ్ (ఫైజర్) వంటి యాంటీవైరల్ మాత్రలు USలో అందుబాటులో ఉన్నాయి, వీటిని లక్షణాలు ప్రారంభమైన ఐదు రోజుల్లోపు తీసుకోవచ్చు. కానీ చాలా మంది వాటిని సరైన సమయంలో ఉపయోగించరు. సకాలంలో పరీక్షలు, మందులతో తీవ్రమైన ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని వైద్యులు అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..