ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు క్యాన్సర్.. చేతిలో డబ్బులేక ఆశలు వదిలేసుకున్నాడు.. ఇంటర్‌నెట్ అద్భుతం చేసింది..!
ఆ విషాద క్షణాలను వారు వీడియో తీసుకున్నారు. అనంతరం ఈ వీడియోని డెంగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ, ఈ వీడియో తన జీవితాన్నే మార్చేసింది. అతనికి సహాయం చేయడానికి వందలాది మంది ముందుకు వచ్చారు. మెయిడీ మళ్ళీ ఆసుపత్రిలో చేరింది.

మృత్యువు కోరల నుంచి భార్యను తిరిగి తీసుకొచ్చిన భర్త కథ చైనాలో జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ కథ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన ఒక యువకుడిది. డెంగ్ యుకాయ్ అనే 30 ఏళ్ల వ్యక్తి భార్య క్యాన్సర్ బారిన పడింది. డెంగ్ తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. వైద్యులు ఆశ వదులుకోమని చెప్పారు..అయినా అతడు ఎవరి మాట వినలేదు.. డెంగ్ తన భార్య చికిత్స కోసం 20 లక్షల యువాన్లు (సుమారు రూ. 2,38,88,563.27) ఖర్చు చేశాడు. ప్రతి క్షణం తన భార్యతోనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.. చివరకు..
2016లో ఒక స్నేహితుడి వివాహంలో డెంగ్, మెయిడీ కలుసుకున్నారు. క్యాన్సర్ ఉన్నప్పటికీ డెంగ్ మెయిడీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వారిద్దరూ 2019 లో వివాహం చేసుకున్నారు. డెంగ్ మెయిడీకి ఆమెను అన్ని విధాలుగా చూసుకుంటానని, ఆమెకు చికిత్స అందిస్తానని వాగ్దానం చేశాడు. 2021లో వీరికి కుమార్తె హన్నా జన్మించింది.
కానీ ఒక సంవత్సరం తర్వాత, మెయిడీ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెయిడీ స్వయంగా చికిత్స ఆపివేసి ఇంటికి వచ్చేసింది. ఇక తాను బ్రతకనంటూ భర్త, కూతురితో వీడ్కోలు తీసుకుంది. ఆ విషాద క్షణాలను వారు వీడియో తీసుకున్నారు. అనంతరం ఈ వీడియోని డెంగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ, ఈ వీడియో తన జీవితాన్నే మార్చేసింది. అతనికి సహాయం చేయడానికి వందలాది మంది ముందుకు వచ్చారు. మెయిడీ మళ్ళీ ఆసుపత్రిలో చేరింది.
డెంగ్ తన ఉద్యోగాన్ని వదిలివేసి, తన భార్యను రాత్రింబవళ్లు చూసుకోవడం ప్రారంభించాడు. అతను ఆమె సంతోషం కోసం పాటలు పాడేవాడు, డ్యాన్స్ చేసేవాడు. ఆమెను సంతోషంగా ఉంచడానికి సాధ్యమైనదంతా చేసేవాడు. ఆశ్చర్యకరంగా కోమాలో ఉన్న మెయిడీ నేడు మళ్ళీ బ్రతికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఎవరి సహాయం లేకుండా నడవగలదు. ఒక చిన్న దుకాణం కూడా నడుపుతుంది. డెంగ్, మెయిడీల ప్రేమకథ చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




