Corona – Omicron: ఒమిక్రాన్ విషయంలో ఊరట కలిగించే న్యూస్ చెప్పింది సౌతాఫ్రికా.. అదేంటంటే..

Corona - Omicron: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడంతా ఒకటే టెన్షన్. ఒమిక్రాన్‌, ఒమిక్రాన్‌. అది సోకితే ఏంటి పరిస్థితి అనే భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే న్యూస్ చెప్పింది..

Corona - Omicron: ఒమిక్రాన్ విషయంలో ఊరట కలిగించే న్యూస్ చెప్పింది సౌతాఫ్రికా.. అదేంటంటే..
Omicron
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2021 | 6:51 AM

Corona – Omicron: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడంతా ఒకటే టెన్షన్. ఒమిక్రాన్‌, ఒమిక్రాన్‌. అది సోకితే ఏంటి పరిస్థితి అనే భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే న్యూస్ చెప్పింది సౌతాఫ్రికా. అవును.. ఒమిక్రాన్‌ గురించి భయపడి అనేక దేశాలు ఆంక్షల దిశగా అడుగులేశాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఒమిక్రాన్‌ దెబ్బకు పలు దేశాల నుంచి వచ్చే విమానాలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది దక్షిణాఫ్రికా. సార్స్‌కోవ్‌-2 కొత్త మ్యూటేషన్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని చెబుతున్నారు దక్షిణాఫ్రికాకు డాక్టర్‌లు.

దీని ప్రభావం అందరూ భయపడినంత ఉండబోదని వివరించారు దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ. కొత్త వేరియంట్‌ను తొలిదశలో అనుమానించిన వారిలో కోయెట్టీ కూడా ఒకరు. డెల్టా వేరియంట్‌ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు వచ్చినట్లు వెల్లడించారామె. వీరిందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, వారు తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారని తెలిపారు ఆ డాక్టర్. ఆ పేషెంట్లను ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించామని, వాసన, రుచి పోవడం, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడం వంటి లక్షణాలు వీరిలో కనిపించలేదని వెల్లడించారు కోయెట్టీ.

అటు కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించే అంశంపై కీలక ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనిని కూడా ఇతర వేరియంట్ల లాగానే పీసీఆర్‌ పరీక్షల్లో గుర్తించవచ్చని వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏమేరకు ప్రభావితం చేస్తోందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ వేరియంట్‌ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశంపై, రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వేరియంట్‌ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో కూడా చెప్పేందుకు తగినంత సమాచారం లేదని, కాకపోతే గతంలో కొవిడ్‌ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్‌ బారిన పడేందుకు అవకాశం ఉందనటానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం