బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించారు. అతి చిన్న వయసులోనే ఆయన ప్రధాని కావడంపై ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన అల్లుడి విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి స్పందించారు. సునక్ ప్రధాని కావడంపై తాము ఎంతో గర్వపడుతున్నామని అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం తన వంతు కృషి చేస్తాడని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. రిషి సునక్ ఔన్నత్యంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు భారతదేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించారని.. ఇంత పెద్ద అభివృద్ధిని తాము ఊహించలేదని అన్నారు. రిషికి అభినందనలు. మేం అతనిని చూసి గర్విస్తున్నాం.. అతని విజయాన్ని కోరుకుంటున్నాం అంటూ ఆయన ట్వీట్ చేశారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసిస్తున్నానని నారాయణ మూర్తి అన్నారు. ఫార్మసిస్ట్ తల్లి, డాక్టర్ అయిన తండ్రికి కుమారుడు రిషి సునాక్. ఇంగ్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ఒకటైన వించెస్టర్, ఆపై ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించారు. ఆయన గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ లో మూడేళ్లు గడిపారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుండి ఎంబీఏ పట్టా పొందాడు.
రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి.. నారాయణ మూర్తి కుమార్తె. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే సమయంలో ఆమెకు రిషితో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలవడంతో పెద్దల అంగీకారంతో 2009లో వివాహం జరిగింది. అయితే సునక్ యూకేలో పుట్టి పెరిగినప్పటికీ అతని భారతీయ మూలాలు, భారతదేశంకు చెందిన అత్యంత గౌరవనీయమైన ప్రముఖ వ్యాపార నాయకులలో ఒకరైన మూర్తితో అతని సంబంధాల కారణంగా భారత్‌కు మరింత పేరొచ్చింది. ఇక బ్రిటన్‌కు కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు ప్రధాని నరేంద్రమోడీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. రిషి నాయకత్వంలో బ్రిటన్ మరింత ఆర్ధికాభివృద్ధిని సాధిస్తుందని మోడీ తెలిపారు.1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు.
NR Narayana Murthy, Infosys founder & father-in-law of Britain’s next PM Rishi Sunak: “Congratulations to Rishi. We are proud of him and we wish him success. We are confident he will do his best for the people of the United Kingdom.”
(File pics) pic.twitter.com/ARqmSIICDf
— ANI (@ANI) October 25, 2022
200 ఏళ్ల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్‌కు తొలిసారిగా భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ప్రధాని కావడం అభినందనలు హోరెత్తిపోతున్నాయి. ఇతర దేశాల్లో అత్యంత ప్రధాన్యత ఉన్న పదవుల్లో ఉన్న నాలుగో వ్యక్తిగా రిషి సునాక్ రికార్డు సృష్టించారు. 193 మంది కన్జర్వేటివ్ ఎంపీలు రిషి సనాక్‌కు మద్దతు ప్రకటించారు. ఈనెల 28వ తేదీన రిషి సనాక్ బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో రిషి సునాక్ కు మార్గం సుగమమైంది. భారత దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్‌గా దీపావళి ఉత్సవాలు నిర్వహించారు. ఇదే అసలైన దీపావళి అంటూ కొందరు అభివర్ణించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్ సునాక్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి