తాజా పోల్ సర్వేల్లో ట్రంప్ వెనుకంజ

అమెరికాలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజా సర్వేల్లో ట్రంప్ కాస్త వెనకంజలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

తాజా పోల్ సర్వేల్లో ట్రంప్ వెనుకంజ
Follow us

|

Updated on: Jun 10, 2020 | 10:58 PM

అమెరికాలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజా సర్వేల్లో ట్రంప్ కాస్త వెనకంజలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న డెమొక్రాటిక్​ పార్టీ నామినీ జో బిడెన్.. తాజా సర్వేల్లో ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కంటే ముందున్నారు. సీఎన్ఎన్ కోసం ఎస్ఎస్ఆర్ఎస్ జరిపిన సర్వేలో ట్రంప్​ కంటే బిడెన్ ఎక్కువ పాయింట్లు సాధించాడు. దేశవ్యాప్త సర్వేలో ట్రంప్​కు 41 శాతం ఓట్లు వస్తే.. బిడెన్​కు 55 శాతం ఓట్లతో మంచి లీడ్​లో ఉన్నారు. ట్రంప్​ మద్దతుదారుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు తిరిగి ట్రంప్​ను రీఎలెక్ట్​ చేస్తామని చెప్పారు. ఇక 27 శాతం మంది బిడెన్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. బిడెన్​ ఓటర్లలో 37 శాతం మంది మాత్రమే ప్రోబిడెన్ ప్లాన్​కు ఓకే చెప్పారు. 60 శాతం మంది ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. ఆదివారం రిలీజ్​ చేసిన ఎన్బీసీ న్యూస్/వాల్​స్ట్రీట్​ జర్నల్​ పోల్​లో కూడా బిడెన్​ ముందంజలో ఉన్నారు. బిడెన్​కు 49 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్​కు 42 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ సీఎన్ఎన్ సర్వేలో బిడెన్​ 50 శాతం మార్కును తాటారు. 2016 ఎన్నికల క్యాంపెయిన్​ టైమ్​లో ట్రంప్​ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నేషనల్​ పోల్స్​ లో ఈ ఫీట్​ సాధించలేకపోయారు. యూత్​ను ఆకట్టుకోవడంలో బిడెన్​ బాగా వెనుకబడ్డాడు. మరో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న అమెరికాలో చివరికి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు