బరువు తగ్గండి రూ.కోటి గెలుచుకోండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీ సరికొత్త ఛాలెంజ్!
Million Yuan Weight Loss Challenge: ఉద్యోగులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. కానీ, ఇక్కడో టెక్ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులు బరువు తగ్గేందుకు సరికొత్త ఛాలెంజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్‌లో నెగ్గి బరువు తగ్గిన వారికి ఏకంగా కోటి రూపాయలకు పైగా బోనస్‌గా ప్రకటించింది. ఈ వినూత్న కార్యక్రమంతో ఆ టెక్ కంపెనీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

చైనా దేశంలోని షెన్‌జెన్‌కు చెందిన అరాషి విజన్ ఇంక్( ఇన్‌స్టా360)గా ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ తమ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 12న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పేరుతో ప్రతి ఏటా కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ పోటీలో ఉద్యోగులు బరువు తగ్గితే వారికి కంపెనీ నగదు బహుమతి అందజేస్తుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఉద్యోగి ప్రతి 0.5 కిలోల బరువు తగ్గితే, వారు 500 యువాన్లు అంటే (సుమారు ₹ 6,100) కంపెనీ నుంచి ప్రోత్సాహకంగా అందుకుంటారు. మొత్తం బోనస్ విలువ మిలియన్ యువాన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.23 కోట్లు.
ఈ సంవత్సరం ఛాలెంజ్‌లో భాగంగా గ్జీ యాకీ అనే ఉద్యోగి 90 రోజుల్లో 20 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గి “వెయిల్ లాస్ ఛాంపియన్” బిరుదును సొంతం చేసుకుంది. ఇందుకు గాను ఆమె కంపెనీ నుంచి 20,000 యువాన్లు అంటే సుమారు ₹ 2.47 లక్షలు నగదును గెలుచుకుంది. ఈ గెలుపుపై ఆమె మట్లాడుతూ క్రమశిక్షణ, నియంత్రిత ఆహారం, రోజువారీ 1.5 గంటల వ్యాయామం తన విజయానికి కారణమని క్సీ పేర్కొంది. “నా జీవితంలో నన్ను నేను ఉత్తమంగా మార్చుకోవడానికి ఇదే ఉత్తమ సమయం అని నేను నమ్ముతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ పోటీలో నెగ్గిన వారు మళ్లి తిరిగి బరువు పెరిగితే.. అలా పెరిగిన ప్రతి 0.5 కేజీలకు 800 యువాన్లు అంటే సుమారు ₹ 9,800 కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆసక్తికరంగా ఇప్పటివరకు అలా ఎవరూ బరువు పెరగలేదు కంపెనీ కూడా ఎవరికీ ఎటువంటి జరిమానాలు విధించబడలేదు. 2022 నుండి ఇప్పటి వరకు ఆ చైనీస్ సంస్థ ఏడు సార్లు ఈ ఛాలెంజ్‌ను నిర్వహించింది, దాదాపు 2 మిలియన్ యువాన్‌లను (సుమారు ₹ 2.47 కోట్లు) రివార్డులుగా పంపిణీ ఉద్యోగులకు అందజేసింది. గత సంవత్సరంలోనే, 99 మంది ఉద్యోగులు సమిష్టిగా 950 కిలోలు బరువు తగ్గి ఒక మిలియన్ యువాన్‌ను పంచుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
