Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wet Markets: గుబులు పుట్టిస్తున్న 18 కొత్త వైరస్‌లు.. మానవాళి అంతం.. మా పంతం అంటున్న చైనా వెట్ మర్కెట్స్.!

China Wet Markets: చైనా వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇంకా ప్రపంచ దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలం ఇంకా కొనసాగుతూనే..

Wet Markets: గుబులు పుట్టిస్తున్న 18 కొత్త వైరస్‌లు.. మానవాళి అంతం.. మా పంతం అంటున్న చైనా వెట్ మర్కెట్స్.!
China Wet Markets
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2021 | 2:00 PM

China Wet Markets: చైనా వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఇంకా ప్రపంచ దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. కోవిడ్ సృష్టిస్తున్న కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటికీ కొత్త వైరస్ లకు కొదవలేదని తెలుస్తోంది.  తాజాగా చైనాలోని వెట్ మార్కేట్స్ లో మరో 18 ప్రమాదకరమైన వైరస్ లను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..

అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చైనాలో వెట్డి మార్కెట్‌లలో 18 కొత్త జూనోటిక్ వైరస్‌లను కనుగొంది. ఈ వైరస్‌లు మానవులకు, పెంపుడు జంతువులకు ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్పారు. చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల బృందం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత డ్రాగన్ ప్రభుత్వం పలు జంతువుల అమ్మకాలపై నిషేధం విధించింది, అయితే  ఈ నిషేధం విధించిన జంతువులపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపింది. తమ పరిశోధనలను 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై చేశారు. అయితే ఈ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి.

చైనా లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త షూసు మాట్లాడుతూ తాము చేసిన పరిశోధనల్లో 71 రకాల వైరస్‌లను గుర్తించామని చెప్పారు. వీటిల్లో 45 వైరస్‌లు కొత్తవని.. వాటిల్లో 18 రకాలు వైరస్ లు మనుషులు, జంతువులకు ప్రమాదకరమైనవని చెప్పారు.

ఈ వైరస్ లు వ్యాప్తికి వన్యప్రాణులు కీలక పాత్రను పోషిస్తున్నాయని.. అందుకనే తాము వీటి అమ్మకాలపై నిషేధం విధించామని చైనా ప్రభుత్వానికి సూచించినట్లు ఓ శాస్త్రవేత్త చెప్పారు.

ముఖ్యంగా పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లో అత్యధికంగా ప్రమాదకర వైరస్‌లు ఉన్నాయని తమ పరిశోధనలో తేలిందని అన్నారు. అంతేకాదు గబ్బిలాల నుంచి వచ్చే హెచ్‌కేయూ8 రకం వైరస్ .. సివెట్‌ జంతువుకు సోకిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదకరమైన వైరస్ లు పలు జంతువుల్లో కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా సృష్టిస్తున్న విధ్వసం నుంచి కోలుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వైరస్ లు కనుక మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తే.. మానవాళి పని ఏమిటా అంటూ ఆందోళలన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:   చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్.. చేమ దుంపలు..