AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taro Root Benefits: చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్.. చేమ దుంపలు..

Taro Root Benefits: చలికాలం మొదలయింది దీంతో శరీరాన్ని చలి తీవ్రత నుంచి రక్షించే విధమైన పద్ధతులు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాన్ని..

Taro Root Benefits: చలికాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్.. చేమ దుంపలు..
Taro Root
Surya Kala
|

Updated on: Nov 18, 2021 | 1:27 PM

Share

Taro Root Benefits: చలికాలం మొదలయింది దీంతో శరీరాన్ని చలి తీవ్రత నుంచి రక్షించే విధమైన పద్ధతులు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాన్ని తగిన విధంగా ఎంపిక చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  ముఖ్యంగా శీతాకాలంలో తినే ఆహారంలో చేమను చేర్చుకోమని అంటున్నారు. ఈ చేమ దుంపను ఆహారంగా ప్రాచీన కాలం నుంచి  ఉపయోగిస్తున్నారు. దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించగలదని, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందని నిరూపించబడింది.

ఈ చేమ దుంపను మనదేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ రూపాల్లో ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా భారతదేశంలోని గోవా, కర్నాటక , మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో వడలు, ఫోడి వంటి వంటకాలు చేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్రై, పులుసు వంటి కూరలను చేస్తారు. ఒక ఒడిశాలో చేమ దుంప.. పప్పుతో చేసిన ప్రసిద్ధ వంటకం సారు బెసర.  అంతేకాదు చేమ దుంప వేర్లు కూడా నూనెలో బాగా వేయించి, ఎర్ర మిరప పొడి , ఉప్పు చల్లి సారు చిప్స్‌ను తయారుచేస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు:  చేమ దుంపల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు సి , విటమిన్ ఇ లు అధికం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చేమ దుంప పిండి పదార్ధమైన కూరగాయ అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర నియంత్రణ చేసే రెండు రకాల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఫైబర్ , ఇతర కార్బోహైడ్రేట్లు..  జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

పోషక విలువల పరంగా, 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీలను ఇస్తాయి.  చేమ దుంపలో డయటరీ ఫైబర్‌ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో  ప్రోటీన్లు  కొద్దిగానే ఉంటాయి.

Also Read:  రేపు చెన్నై సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..