AP Weather Alert: రేపు చెన్నై సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Alert: ఓ వైపు నైరుతి పవనాలు తిరోగమనం.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం, అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు..
AP Weather Alert: ఓ వైపు నైరుతి పవనాలు తిరోగమనం.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం, అల్పపీడనాలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీలోని వాతావరణ పరిస్థితిపై ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు స్పందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశముందని చెప్పారు.
దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని కె కన్నబాబు చెప్పారు. దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. దీంతో తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ముందుగా హెచ్చరించారు. అంతేకాదు లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కె.కన్నబాబు సూచించారు.
Also Read: ఉత్సవాల్లో కాలితో స్వామి తంతే చాలు కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.. క్యూ కట్టిన భక్తులు..