China Coronavirus: చైనాలో కరోనా మరణ మృదంగం.. 30 రోజుల్లో 60 వేల మంది మృతి..
కరోనా విలయతాండానికి మహమ్మారి పుట్టినిళ్లు చైనా కుదైలైంది. మహమ్మారి దాటికి కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది చనిపోయారు. దేశంలో అమల్లో ఉన్న జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం..
కరోనా విలయతాండానికి మహమ్మారి పుట్టినిళ్లు చైనా కుదైలైంది. మహమ్మారి దాటికి కేవలం 30 రోజుల్లోనే 60 వేల మంది చనిపోయారు. దేశంలో అమల్లో ఉన్న జీరో కోవిడ్ పాలసీని చైనా ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 8న ఎత్తివేయడంతో భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు 59 వేల 938 మంది కరోనాతో చనిపోయినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ చెప్పింది. ఇందులో 5వేల 503 మంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ.. శ్వాస సంబంధిత సమస్యలతో మృతిచెందారు. మరో 54 వేల 435 మంది వేరువేరు కారణాలతో చనిపోయారని తెలిపింది.
మృతి చెందినవారిలో 90 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారేనని NHC వెల్లడించింది. ఇక చైనాలో కరోనా విలయతాండవానికి అస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా ఉంటుదని చెప్పారు అధికారులు. డిసెంబర్ నాటికే 76 శాతం మంది వైరస్ బారిన పడగా.. ఈ నెలాఖరుకు బాధితుల సంఖ్య 92 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. జనవరి 22 నుంచి చైనాలో ప్రారంభమయ్యే న్యూ ఇయర్, స్ప్రింగ్ ఫెస్టివల్ తో కరోనా కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం ముఖ్య అధికారులు చెప్తున్నారు.
దీంతో వచ్చే 2, 3 నెలలు చైనాకు కఠిన రోజులుగా చెబుతున్నారు. ఈసమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చైనాలో కరోనా తీవ్రస్థాయికి చేరుకుంటుదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు పలు సూచనలు చేసింది. కరోనా మృతులకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాను కోరింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..