Viral: తవ్వకాలు జరుపుతుండగా వినిపించిన భారీ శబ్దం.. ఏంటని చూడగా కళ్లు జిగేల్.!
ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతమంతటా రోమన్స్ కాలం నాటి నిధినిక్షేపాలు దొరుకుతాయని వారు భావించగా..
ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతమంతటా రోమన్స్ కాలం నాటి నిధినిక్షేపాలు దొరుకుతాయని వారు భావించగా.. అంచనాలన్నింటినీ తలక్రిందులు చేస్తూ ఓ పెద్ద నగరమే బయటపడింది. ఈ ఘటన సెంట్రల్ ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. మరి ఆ స్టోరీ..? దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా ఇంగ్లాండ్ అనేది ఒక్కప్పటి రోమన్ సామ్రాజ్యంలోని ప్రాంతీయ భాగం. హాడ్రియన్స్ వాల్(Hadrian’s Wall) లాంటి అసాధారణమైన పురావస్తు నిక్షేపాలు ఎన్నో అక్కడ భూమి లోపల ఉన్నట్లు యూకే ఆర్కియాలజీ అధికారులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే నిజం చేస్తూ.. తాజాగా ఓ సంఘటన సెంట్రల్ ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చిన్న గ్రామంలో సుమారు ఏడాది కాలంగా 80 మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఓ రోమన్ సెటిల్మెంట్ భూమి(Blackgrounds)లో తవ్వకాలు జరిపారు. వారిని ఆశ్చర్యపరుస్తూ ఆ ప్రాంతంలో నిధినిక్షేపాలతో పాటు ఓ నగరమే బయటపడినట్లు తెలుస్తోంది.
సుమారు 30 అడుగుల వెడల్పు కూడిన ఓ రహదారి, అలంకార కుండలు, గాజు పాత్రలు, నగలు, 300కిపైగా నాణేలు ఈ పురావస్తు తవ్వకాలు బయటపడ్డాయి. ఇవే కాకుండా ఇంకా రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన రహస్యాలు ఏవైనా లభిస్తాయేమో అనేలా శాస్త్రవేత్తలు తవ్వకాలు మరింత లోతుగా జరుపుతున్నారు. కాగా, తవ్వకాల్లో బయటపడిన రోడ్డును ఆధారంగా చేసుకుని.. రోమన్స్ ఈ ప్రాంతం నుంచి అనేక నిధినిక్షేపాలను వివిధ ప్రాంతాలకు తరలించి ఉండే అవకాశం ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.(Source)