Secret Police Station: ఆగని డ్రాగన్ కంట్రీ కుయుక్తులు.. అమెరికాలో అక్రమ పోలీస్ స్టేషన్.. షాకింగ్ విషయాలు వెల్లడి..

|

Apr 18, 2023 | 11:06 AM

అమెరికాలోని మాన్‌హట్టన్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది . ఇక్కడ FBI చైనా పోలీసు స్టేషన్‌ కేసుని ఛేదించింది. దీనితో పాటు, ఈ అక్రమ పోలీస్ స్టేషన్‌ను అక్రమంగా నడుపుతున్న ఇద్దరు చైనా పౌరులను సోమవారం అరెస్టు చేశారు. వారిని చెన్ జిన్‌పింగ్ (59), లు జియాన్ వాంగ్ (61)గా గుర్తించారు.

Secret Police Station: ఆగని డ్రాగన్ కంట్రీ కుయుక్తులు.. అమెరికాలో అక్రమ పోలీస్ స్టేషన్.. షాకింగ్ విషయాలు వెల్లడి..
Secret Police Station
Follow us on

అమెరికా, చైనా దేశాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. చైనా ప్రపంచ దేశాల్లో తన ప్రభావాన్ని చాటడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఇతర దేశాల్లో డ్రాగన్ కంట్రీ అక్రమ పోలీస్ స్టేషన్లు నడుపుతోందని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కెనడాలో ఇలాంటి పోలీస్ స్టేషన్ గురించి వార్తలు వెలువడగా. తాజాగా అగ్ర రాజ్యం అమెరికాలో కూడా చైనా తన పోలీస్ స్థావరాలు  ఏర్పాట్లు చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని మాన్‌హట్టన్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది . ఇక్కడ FBI చైనా పోలీసు స్టేషన్‌ కేసుని ఛేదించింది. దీనితో పాటు, ఈ అక్రమ పోలీస్ స్టేషన్‌ను అక్రమంగా నడుపుతున్న ఇద్దరు చైనా పౌరులను సోమవారం అరెస్టు చేశారు. వారిని చెన్ జిన్‌పింగ్ (59), లు జియాన్ వాంగ్ (61)గా గుర్తించారు. వీరిద్దరూ చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ ( ఎంపీఎస్ ) లో పనిచేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.

మీడియా నివేదికల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. జిన్‌పింగ్, జియాన్ అమెరికా ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకుండా రహస్యంగా చైనా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. MPS సూచనల మేరకే వారిద్దరూ అమెరికాలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అమెరికాలో చైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పౌరులను, ప్రవాసులను బెదిరించడమే వారి పని.

ఇవి కూడా చదవండి

చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి బెదిరింపులు
వాస్తవానికి..  FBI ఈ విషయంపై తన దృష్టిని చాలా కాలం నుంచి పెట్టింది. 2022లో విచారణ ప్రారంభించగా.. అమెరికాలో ఓ పెద్ద ఛానల్‌ వీరికి అనుగుణంగా పనిచేస్తోందని తేలింది. దీనితో సంబంధం ఉన్న వ్యక్తులు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా,  విమర్శించిన వారిని ఆన్‌లైన్‌లో బెదిరించేవారు.

చైనీస్ ప్రభుత్వ ఎంపీల కోసం పోలీస్ స్టేషన్
FBI రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టిన అనంతరం.. అమెరికాలో నడుస్తున్న అనేక పోలీసు స్టేషన్లను మూసివేశారు. అయితే ఇంత జరిగినా, చెన్ జిన్‌పింగ్ , లు జియాన్ వాంగ్ లు మాత్రం చైనా ప్రభుత్వ MPS కోసం రహస్యంగా పోలీసు స్టేషన్‌ను నడుపుతూ తమ పనిని కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత, FBI బాధితుల కోసం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

అనేక దేశాల్లో చైనీస్ అక్రమ పోలీస్ స్టేషన్లు 
చైనా అక్రమ  పోలీస్ స్టేషన్లు ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కూడా నడుస్తున్నట్లు సమాచారం. 2022లో కెనడాలో కూడా ఓ కేసు వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఈ విషయంపై అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, అక్రమ పోలీస్ స్టేషన్‌ను నడుపుతూ ఇతర దేశాల  సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేలా చైనా ప్రయత్నించిందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..