China: ఆ దేశానికి భయపడుతున్న చైనా.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బలగాలకు పిలుపు..

కొవిడ్‌ కారణంగా కుదేలైన చైనా - పొరుగు దేశాలపై పట్టు బిగించేందుకు కత్తులు దూస్తోంది. ఆ కత్తులు పదును పెట్టేందుకు రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకుంటూ పోతోంది.

China: ఆ దేశానికి భయపడుతున్న చైనా.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని బలగాలకు పిలుపు..
China Army
Follow us

|

Updated on: Mar 05, 2023 | 2:20 PM

కొవిడ్‌ కారణంగా కుదేలైన చైనా – పొరుగు దేశాలపై పట్టు బిగించేందుకు కత్తులు దూస్తోంది. ఆ కత్తులు పదును పెట్టేందుకు రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకుంటూ పోతోంది. ఇందులో భాగంగానే తాజాగా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతేడాదితో పోల్చితే రక్షణ రంగానికి 7.2 శాతం ఎక్కువ కేటాయించాలని చైనా నిర్ణయించింది. చైనా కరెన్సీ యువాన్‌లో ఇది 1.56 ట్రిలియన్లు. డాలర్లలో చెప్పాలంటే ఇది 230 బిలియన్లు.

రక్షణ బడ్జెట్‌ను చైనా ఇలా పెంచుకుంటూ పోవడం ఇది ఎనిమిదోసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు అధికంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే పరిణామం. మరో వైపు యుద్ధం కోసం సిద్ధంగా ఉండాలని బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పిస్తూ చైనా ప్రధాని లీ క్వికియాంగ్‌ తమ బలగాలకు పిలుపునిచ్చారు.

తైవాన్‌ స్వాతంత్ర్యాన్ని మరింత దీటుగా వ్యతిరేకించాలని చైనా నిర్ణయించింది. తైవాన్‌లోనూ దృష్టిలో పెట్టుకొనే రక్షణ బడ్జెట్‌ను పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. తైవాన్‌లో అమెరికా దళాల కార్యకలాపాలు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. తైవాన్‌ జలసంధిలో అమెరికా నౌకాదళం, అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గస్తీలు ముమ్మరం చేయడం చైనాను ఇబ్బంది పెడుతోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ గతేడాది ఆగస్టులో తైవాన్‌లో పర్యటించడం సంచలనం సృష్టించింది. నాన్సీ పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పర్యటన పూర్తైన వెంటనే తైవాన్‌ సమీపంలో భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టింది చైనా.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అది పెద్ద పదాతి దళం చైనాది. తమ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అందించడం, సరికొత్త యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇచ్చేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..