Imran Khan: పాకిస్తాన్ తాజా, మాజీ ప్రధానుల మధ్య ముదిరిన వివాదం.. అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్టుకు ఛాన్స్..
తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రధాని హోదాలో విదేశాల నుంచి వచ్చిన విలువైన బహుమతులకు ఇమ్రాన్‌ఖాన్ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో..

అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మళ్లీ కష్టాలు పెరిగాయి. లాహోర్ లోని ఇమ్రాన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రధాని హోదాలో విదేశాల నుంచి వచ్చిన విలువైన బహుమతులకు ఇమ్రాన్‌ఖాన్ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో ఇమ్రాన్‌ను పలుమార్లు విచారించారు. విదేశాల నుంచి వచ్చిన గిఫ్ట్‌లను అమ్మేస్తే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని. కాని ఇమ్రాన్ అలా చేయకుడా సొంత ఖాతాల్లో డబ్బును వేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ వారెంట్‌తో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్‌ఖాన్ ఇంటికి వచ్చారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ నివాసానికి భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు కూడా చేరుకున్నారు. పోలీసుల ప్రయత్నాలను వాళ్లు అడ్డుకుంటున్నారు.
ఫిబ్రవరి 28న ఇస్లామాబాద్‌లో అదనపు సెషన్స్ జడ్జి జాఫర్ ఇక్బాల్ మాజీ ప్రధానికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఫిబ్రవరి 28న, అతను నాలుగు వేర్వేరు కేసుల్లో హాజరు కావాల్సి ఉంది. అతను విచారణ కోసం మిగిలిన విచారణకు చేరుకున్నాడు. కానీ తోషాఖానా కేసులో విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇప్పుడు అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
కాగా, ప్రధాని షాబాజ్ షరీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానిపై విమర్శలు చేస్తూ ఇమ్రాన్ ఓ ట్వీట్ చేశాడు. “పాలకులుగా దేశంపై మోసగాళ్లను మోపినప్పుడు దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? షెహబాజ్ షరీఫ్‌పై NAB ద్వారా 8 బిలియన్ల మనీలాండరింగ్, FIA ద్వారా 16 బిలియన్ల కేసులు నమోదయ్యాయి.” మరొకరు చేయబోతున్నారు. అవినీతికి పాల్పడ్డాడ అంటూ విమర్శించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం