కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణీకుల విమానం అక్టౌ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు30కు పైగా మంది ప్రయాణీకులు చనిపోయినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ప్రయాణీకులు ఉన్నారట.
ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం బాకు నుంచి రష్యాలోని చెచెన్యా రాజధాని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రోజ్నీలో దట్టమైన పొగ మంచు ఉండటంతో విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కూలిపోయింది. అయితే స్థానికులు మాత్రం ఈ విమానం ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్ చుట్టూ పలుమార్లు తిరిగిందని చెబుతున్నారు.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
BREAKING: Azerbaijan Airlines flight traveling from Baku to Grozny crashes in Aktau, Kazakhstan, after reportedly requesting an emergency landing pic.twitter.com/hB5toqEFe2
— RT (@RT_com) December 25, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి