పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో ఓ మిస్టరీ వస్తువు అందరినీ కంగారుపెట్టించింది. అయితే, ఇది ఇటీవల ఇస్త్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌లోని పార్ట్ కావొచ్చని అంతా భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు.. ఈ మిస్టరీ వస్తువును పరిశీలిస్తున్నారు. అసలు ఇది ఏంటి అనేదానిపై ఆరా తీస్తున్నారు. అంతర్జాతీయ సైంటిస్టుల సహకారంతో ఇదేంటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది
ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్‌లో పాక్షికంగా దెబ్బతిన్న ఈ మిస్టరీ వస్తువు ఫోటోను షేర్ చేసింది. ‘పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో మిస్టరీ వస్తు కనిపించింది. ఈ వస్తువు ఏంటనే అంశంపై విచారిస్తున్నాం. ఇది అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వాహనం కావొచ్చకు. మరింత సమాచారాన్ని త్వరలో తెలియజేస్తాం.’ అని ప్రకటించింది. ఈ వస్తువు 2.5 మీటర్ల వెడల్పు, 2.5-3 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
అయితే, ఈ మిస్టరీ వస్తువుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించినదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం దీనిని పీఎస్‌ఎల్‌వీ భాగాలై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరికొందరు గతంలో అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్ MH370కి సంబంధించిన శిథిలాలని భావిస్తున్నారు. కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 227 మంది ప్రయాణికులతో మార్చి 8, 2014న బయలుదేరిన MH370 మలేషియా ఎయిర్‌లైన్స్ మిస్స్ అయ్యింది. దానికి సంబంధించిన విడి భాగమేనని అంటున్నారు కొందరు.
అయితే, ఈ వాదనను కూడా ఏవియేషన్ నిపుణులు జియోఫ్రీ థామస్ దీనిని తోసిపుచ్చారు. ఇది విమానానికి సంబంధించిన విభాగం కాదని అంటున్నారు. MH370 తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం మిస్సయ్యిందని, దీనికి సంబంధించిన శిథిలాలు దాదాపుగా అరిగిపోయి ఉంటాయని అన్నారు. కానీ, ఇది కొత్తదానిలా ఉందని, ఇది ఆ విమానం శిథిలాలు కాదని పేర్కొన్నారు.
PSLV third stages are often dumped near Australia for 37° incl. missions. The video mentions it is 2 m high 2 m wide which is consistent with PS3. Also 👇 pic.twitter.com/As4OtiKcOJ
— Debapratim (@debapratim_) July 17, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..