Telugu News World California becomes first US state to pass anti caste discrimination bill
అక్కడ కుల వివిక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం.. హర్షం వక్తం చేస్తున్న ప్రజలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాలోని అట్టడుగు వర్గాల ప్రజల్ని వివక్షతు నుంచే కాపాడేందుకు వీలుగా ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం రోజున 50-3 మెజార్టీతో పాస్ చేసేసింది. ఇక దీనిపై అక్కడి గవర్నర్ గవీన్ న్యూసమ్ సంతకం చేసినట్లైతే ఇది చట్టంగా మారుతుంది. ఇక ఈ చట్టం పరిధిలోకి కులాలను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షత నుంచి రక్షణ కల్పిస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాలోని అట్టడుగు వర్గాల ప్రజల్ని వివక్షతు నుంచే కాపాడేందుకు వీలుగా ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం రోజున 50-3 మెజార్టీతో పాస్ చేసేసింది. ఇక దీనిపై అక్కడి గవర్నర్ గవీన్ న్యూసమ్ సంతకం చేసినట్లైతే ఇది చట్టంగా మారుతుంది. ఇక ఈ చట్టం పరిధిలోకి కులాలను తీసుకొచ్చి అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షత నుంచి రక్షణ కల్పిస్తోంది. అయితే ఈ బిల్లును తొలిసారిదా అయిష వాహబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే దీనికి దేశవ్యాప్తంగా వివిధ కుల, జాతులకు చెందిన ఉద్యమ సంఘాలు కూడా తమ మద్ధతు తెలిపాయి. తాజాగా ఈ బిల్లు ఆమోదం పొందడంతో వాహబ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Proud to announce Senator @aishabbwahab’s bill #SB403, which I presented on the Assembly floor today, passed on a 55-3 vote. This bill prohibits discrimination based on caste in California. pic.twitter.com/kPh04kJnWR
— Assemblymember Damon Connolly (@AsmConnolly) August 28, 2023
ఎస్‌బీ 403 (బిల్లు) కు మద్ధతుగా ఓటు వేసినటువంటి అసెంబ్లీ సభ్యులకు ధన్యవాదాలు ఇని తెలిపారు. సుధీర్ఘ కాలంగా వివక్షకు గురైన అణగారిన వర్గాల ప్రజలను ఈ బిల్లుతో మేము కాపాడాము అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ బిల్లుపై హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా స్పందించింది. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజని అభివర్ణించింది. ఇదిలా ఉండగా ఇక ఈ బిల్లుతో కాలిఫోర్నియా పౌరహక్కుల చట్టాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ కోడ్ వంటి వాటిల్లో అనేక మార్పులు వస్తాయి. అలాగే వారసత్వ కేటగిరి కింద కులనాన్ని చేర్చి సంరక్షిస్తాయి. అయితే ఈ బిల్లుపై ఈక్వాలిటీ ల్యాబ్స్ డైరెక్టర్ తెన్మోలి సౌందర్యరాజన్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 700 వరకు సమావేశాలు నిర్వహించారని.. వీటిలో కుల సమానత్వ రక్షణకు నినదించారని అన్నారు. కులాన్ని జీవితాంతం భరించి.. దాని వల్ల అణిచివేతకు గురై జీవితకాలం పొరాడిన వ్యక్తిగా ఆ కష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు.
The bill withstood an onslaught of attacks to strip it of the word ‘caste.’ https://t.co/p5YgP9c2XM