AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు

పరాగ్వే దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఓ బ్యాంకు కుప్పకూలడంతో బ్యాంకులో డబ్బులు ఉన్నప్పటికీ వాటిని తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం చివరకు దేశ అధ్యక్షుడి పదవికే ఎసరు పెట్టింది. బ్యాంకు యాజమాన్యంతో సంబంధాలు, అధికార దుర్వినియోగం ఆరోపణలతో దేశాధ్యక్షుడు శాంటియాగో పెన్యాను పార్లమెంట్ అభిశంసించింది. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు.

అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
Bank Collapse Hits Paraguay 3 Million Customers Locked Out Of Their Savings
Sharada V
|

Updated on: Nov 08, 2026 | 12:00 PM

Share

దక్షిణ అమెరికాలోని పరాగ్వే దేశంలో యునో బ్యాంక్ (Ueno Bank) సమస్యల్లో చిక్కుకుంది.  బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారడంతో నవంబర్ 3న పరాగ్వే సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. బ్యాంకు కార్యకలాపాలపై నియంత్రణ తీసుకుంది. దీంతో ఖాతాదారులు తమ పొదుపు మొత్తాల లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రభుత్వ నిధులు, పెన్షన్ డబ్బులు బ్యాంకులో చిక్కుకుపోయాయి.

వేగంగా ఎదిగిన బ్యాంకు ఎలా కుప్పకూలింది?

యునో బ్యాంకు వెనుక గ్రూపో వాజ్క్వెజ్ (Grupo Vazquez) అనే వ్యాపార సంస్థ ఉంది. ఫైనాన్సియెరా యునోను కొనుగోలు చేసి విజన్ బ్యాంకోను విలీనం చేసుకునిమరింత విస్తరించింది. బ్యాంక్‌ ఆర్థిక నిర్వహణలో లోపాలు ఉన్నట్లు నియంత్రణ సంస్థల పరిశీలనలో వెల్లడైంది. బ్యాంకు యజమానులకు సంబంధం ఉన్న కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ రుణాలకు తగిన భద్రత లేదని, పత్రాలు కూడా సరిగా లేవని అధికారులు గుర్తించారు. బ్యాంకు యజమానులకు సంబంధం ఉన్న సంస్థలకు పరిమితులకు మించి రుణాలు ఇచ్చినట్లు తేలింది.

యునో బ్యాంకు మూలధనం సగానికి పడిపోయింది. దీంతో నవంబర్ 3న బ్యాంకుపై చర్యలు ప్రారంభించింది సెంట్రల్‌ బ్యాంక్‌. ఖాతాదారుల డిపాజిట్లను ఇతర బ్యాంకులకు బదిలీ చేసింది.  ప్రత్యేక చట్టాన్ని అమలు చేసింది. నవంబర్ 5 నుంచి తక్కువ మొత్తాల్లో డబ్బులు ఉన్న ఖాతాదారులకు చెల్లింపులు ప్రారంభించింది.

అధ్యక్షుడు పెన్యాకు బ్యాంకుతో సంబంధం ఏమిటి?

అధ్యక్షుడు శాంటియాగో పెన్యాకు గ్రూపో వాజ్క్వెజ్ సంస్థతో గతంలో సంబంధాలు ఉండటమే రాజకీయ వివాదానికి ప్రధాన కారణమైంది. పెన్యా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)లో పనిచేశారు.  ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఆగస్టులో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే ఆయనకు గతంలో యునో బ్యాంకును నియంత్రించే గ్రూపో వాజ్క్వెజ్‌లో వాటా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2025 మార్చిలోనే ఆ వాటాను విక్రయించానని, యునో బ్యాంకులో నేరుగా పెట్టుబడులు పెట్టలేదని పెన్యా చెబుతున్నారు. కానీ ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి బ్యాంకు విస్తరణకు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆరోపణలను ఆయన ఖండించారు.

మరో వివాదాస్పద అంశం కూడా ఉంది. యునో బ్యాంకు పూర్వ సంస్థ అయిన ఫైనాన్సియెరా యునోకు గతంలో అధిపతిగా పనిచేసిన కార్లోస్ కార్వాలో ను పెన్యా .. పరాగ్వే సెంట్రల్ బ్యాంకు అధ్యక్షుడిగా నియమించారు. బ్యాంకు పర్యవేక్షణలో వైఫల్యాలపై విమర్శలు రావడంతో నవంబర్ 3న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

వీధుల్లోకి ఖాతాదారులు.. అధ్యక్షుడిపై అభిశంసన అస్త్రం!

బ్యాంకులో తమ డబ్బులు నిలిచిపోవడంతో రాజధాని అసున్సియోన్‌లో ఖాతాదారులు ఆందోళనలకు దిగారు. ఈ పరిస్థితుల్లో నవంబర్ 4న ప్రతిపక్ష ఎంపీలు అధ్యక్షుడు పెన్యాపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధికార కొలరాడో పార్టీకి చెందిన కీలక నేత, మాజీ అధ్యక్షుడు హొరాసియో కార్టెస్ అభిశంసనకు మద్దతు ప్రకటించారు.

నవంబర్ 5న పెన్యా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆమోదం పొందలేదు. అభిశంసన తర్వాత సెనేట్ పెన్యాను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గృహ నిర్బంధంలో మాజీ అధ్యక్షుడు.. 27 మందిపై కేసులు!

పదవి నుంచి తొలగించిన కొద్దిసేపటికే పెన్యాను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. యునో బ్యాంకు వ్యవహారంలో అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించడం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు బ్యాంకు వ్యవహారానికి సంబంధించి 27 మంది అధికారులుపై నమ్మకద్రోహం, మోసానికి ప్రయత్నించడం వంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. బ్యాంకు వ్యవస్థాపకుడు మిగ్యుయెల్ వాజ్క్వెజ్, అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ గుస్తాలేతో సహా ఆరుగురు ఉన్నతాధికారులను జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. మరో ఇద్దరిని గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ కార్లోస్ కార్వాలో అరెస్టుకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త అధ్యక్షుడు పెడ్రో అలియానాపై కూడా బ్యాంకుతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

రాజీనామా చేస్తే జీవితకాల రక్షణ.. అందుకే అభిశంసన చేశారా?

ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉంది. పరాగ్వేలో మాజీ అధ్యక్షులకు జీవితకాలం సెనేట్ సభ్యత్వం లభించే అవకాశం ఉంది. దాంతో పాటు కొన్ని చట్టపరమైన రక్షణలు కూడా ఉంటాయి. పెన్యా రాజీనామాను ఆమోదిస్తే ఆయనకు ఈ ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంది. అయితే అభిశంసన ద్వారా పదవి నుంచి తొలగిస్తే ఆ హోదా, దాని ద్వారా లభించే రక్షణలు కోల్పోతారు. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించకుండా అభిశంసన ప్రక్రియను కొనసాగించినట్లు ప్రతిపక్ష ఎంపీలు వాదించారు.

మొత్తంగా చూస్తే.. ఒక డిజిటల్ బ్యాంకు ఆర్థికంగా కుప్పకూలడం లక్షలాది మంది ఖాతాదారులను ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, దేశ అధ్యక్షుడి పదవిని కూడా కూల్చివేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇలాంటి సంక్షోభం రావడం పరాగ్వేలో బ్యాంకుల పర్యవేక్షణ, ప్రభుత్వ బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Follow Us
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే