AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anju Kurian: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?

 సాధారణంగా ఎంగేజ్మెంట్ అయిన నెలల్లోపే పెళ్లి చేసుకుంటారు చాలా మంది. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఎంగేజ్మెంట్ జరిగిన రెండేళ్ల తర్వాత పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Anju Kurian: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?
Anju Kurian
Basha Shek
|

Updated on: Nov 08, 2026 | 12:00 PM

Share

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజూ కురియన్ పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. కేరళలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శనివారం ఈ శుభకార్యం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా అంజూనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అంజూ కురియన్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2024 అక్టోబర్ లో అంజూ- రోషన్ ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాలతో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లిపీటలెక్కారు అంజూ- రోషన్. ఇక అంజు విషయానికి వస్తే.. కేరళలోని కొట్టాయం ప్రాంతంలో పుట్టి పెరిగింది. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. సినిమాల్లోకి వచ్చేముందుకు ఒక ప్రముఖ సంస్థలో రెండేళ్ల పాటు వర్క్ చేసింది. అయితే నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిది అంజు కురియన్. ఇక 201‍3లో ‘నేరమ్’ అనే మలయాళ మూవీతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ప్రేమమ్, ఓం శాంతి ఓషానా , కవి ఉద్దీతుత్తు, నాన్ ప్రకాశన్, జాక్ అండ్ డేనియల్, మెప్పడియాన్, అబ్రహం ఓస్లర్ తదితర సినిమాల్లో హీరోయిన్ గానూ, సహాయక నటి పాత్రలు పోషించిందీ అందాల తార. 018లో ‘ఇదం జగత్’ అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్‪‌గా చేసింది అంజు కురియన్. ఇక ఇటీవల ఓహో ఎంతన్ బేబీ, అదర్స్, ఇదయం మురళి సినిమాల్లో కనిపించిందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

అంజు కురియన్ పెళ్లి ఫొటోస్..

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అంజూకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.

అంజు కురియన్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Anju Kurian (Ju) (@anjutk10)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే