AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో అంతుచిక్కని అద్భుతం..

దీపావళి అంటేనే దీపాల పండుగ.. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తే.. ఆ గ్రామంలో మాత్రం ఓ ప్రత్యేకమైన దీపం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. సాధారణంగా దేవుడి ముందు వెలిగించే దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. కానీ అక్కడ మాత్రం రెండు దీపాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. రెండు దీపాల్లో ఒకటి నిశ్చలంగా ఉంటే.. మరొకటి నిరంతరం కదులుతూ ఉంటుంది. దీపావళి పర్వదినాన.. ఆ అఖండ దీపాన్ని భక్తులు దర్శించుకుంటారు. అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యం.. కలిగిన ఆ పుణ్య క్షేత్రం గురించి తెలుసుకోవాలాంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో అంతుచిక్కని అద్భుతం..
Vadapally Narasimha Swamy Temple
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 08, 2026 | 11:42 AM

Share

ప్రకృతి అందాలకు.. ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా నిలుస్తోంది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి. ఒకవైపు కృష్ణమ్మ.. మరోవైపు మూసీ నది.. ఈ రెండు నదుల సంగమ తీరాన కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో ప్రత్యేకం. ఇక్కడి స్వామివారి మహత్యం మాత్రం ఎంతో విశిష్టం. ఇది పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటి. శివకేశవుల అభేదాన్ని చాటే ఈ పుణ్యక్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉందని స్థలపురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా దేవుడి ముందు వెలిగించే దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. కానీ వాడపల్లి నరసింహుడి గర్భాలయంలోని అఖండ దీపానికి ప్రత్యేకత ఉంది. స్వామివారి సన్నిధిలో మాత్రం రెండు దీపాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. స్వామి వారి ముఖానికి ఎదురుగా ఒక దీపం.. కాస్త కింద మరో దీపం ఏర్పాటు చేశారు. అందులో ముఖానికి ఎదురుగా ఉన్న దీపం నిరంతరం రెపరెపలాడుతూ కదులుతుంటే.. కింద ఉన్న దీపం మాత్రం నిశ్చలంగా వెలుగుతుంటుంది. ఈ ప్రత్యేకతను స్వామివారి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. స్వామివారు సజీవంగా శ్వాసిస్తున్నారనే విశ్వాసంతో ఆ దీపాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

దీపావళి వేళ భక్తుల సందడి..

ఇక దీపావళి పండుగ రోజున వాడపల్లి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి మరింత పెరుగుతుంది. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పర్వదినాన.. నరసింహుడి అఖండ దీపాన్ని దర్శించుకోవడం భక్తులకు ఓ ప్రత్యేక అనుభూతి. అందుకే ఏటా దీపాల పండుగ వేళ నరసింహుడి సన్నిధిలో నువ్వుల నూనె సమర్పిస్తూ.. అఖండ దీపం వెలుగుల్లో దైవదర్శనం చేసుకుంటారు. తమ ఇళ్లలోనూ సుఖశాంతులు వెల్లివిరియాలని.. కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటారు. దీపం వెలుగులో లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడం తమకు ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

అఖండ జ్యోతి వెనుక స్థలపురాణం..

ఈ క్షేత్రానికి సంబంధించి ఆసక్తికరమైన స్థలపురాణం ప్రచారంలో ఉంది. అగస్త్య మహాముని కృష్ణా, మూసీ నదుల సంగమ ప్రాంతానికి వచ్చి శివకేశవుల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు స్థానిక ఐతిహాసలు చెబుతున్నాయి. నరసింహస్వామివారు హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్నారని.. ఆ ఉగ్రరూపంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు గుర్తుగా ముఖం ముందు దీపం కదులుతుంటుందని చెబుతుంటారు. ఈ విశేషమే వాడపల్లి క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇక్కడి దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు.. భక్తుల దృష్టిలో స్వామివారి సాన్నిధ్యానికి ప్రతీక. వెలుగుల పండుగకు ఆధ్యాత్మిక శోభను అద్దుతున్న వాడపల్లి అఖండ దీపం.. భక్తుల విశ్వాసానికి నిత్య ప్రతీకగా నిలుస్తోంది.

Follow Us
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల స్టైల్‌లో వంకాయ ఊరగాయ పచ్చడి.. ఇలా పెడితే అదిరిపోద్దీ
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఇంట్లో కూరగాయలు లేవా? 5 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి పచ్చడి చేయండి
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే
ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణించాలంటే వీసా, పాస్‌పోర్ట్‌ ఉండాల్సిందే
కోహ్లీపైకి బ్యాట్ విసిరిన అభిమాని.. ఆ తర్వాత జరిగింది ఇదే..!
కోహ్లీపైకి బ్యాట్ విసిరిన అభిమాని.. ఆ తర్వాత జరిగింది ఇదే..!
దొంగకు ప్రయాణికుల అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్..!
దొంగకు ప్రయాణికుల అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్..!
CAT 2026 హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CAT 2026 హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా యతీంద్ర సప్తతి మహోత్సవాలు..
ముచ్చింతల్‌లో అంగరంగ వైభవంగా యతీంద్ర సప్తతి మహోత్సవాలు..