AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: ప్రపంచాన్ని భయపెడుతోన్న బాబా వంగా డబుల్ ఫైర్ జోస్యం.. ఆగస్టు నెలలో ఏం జరగబోతోంది?

బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా 29 సంవత్సరాల క్రితం మరణించారు. అయితే ఆమె భవిష్యత్ కోసం వేసిన అంచనాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి వేసిన అంచనాలు నేటికీ ముఖ్యాంశాలలో నిలుస్తున్నాయి. అయితే బాబా వంగా ఆగష్టు నెలకు కోసం వేసిన అంచనా 'డబుల్ ఫైర్' వాదన వెలుగులోకి వచ్చింది. దీంతో బాబా వంగా జోస్యం ప్రపంచాన్ని భయపెడుతోంది.

Baba Vanga: ప్రపంచాన్ని భయపెడుతోన్న బాబా వంగా డబుల్ ఫైర్ జోస్యం.. ఆగస్టు నెలలో ఏం జరగబోతోంది?
Baba Vanga Prediction August 2025
Surya Kala
|

Updated on: Aug 05, 2025 | 1:04 PM

Share

బల్గేరియాకు చెందిన ప్రముఖ ప్రవక్త బాబా వంగా 2025 సంవత్సరం గురించి చెప్పిన జోస్యం చాలా వరకూ నిజమై కనిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో నెల ముగిసి కొత్త నెలలో అడుగు పెడుతుంటే చాలు.. అందరి దృష్టి బాబా వంగా జ్యోస్యం మీదకు వెళ్తుంది. ఈ నెల గురించి బాబా వంగా మైన చెప్పిందా అని ఆలోచిస్తున్నారు. జూలై నెల ముగిసి ఆగష్టు నెలలో అడుగు పెట్టాం.. దీంతో బాబా వంగా ‘డబుల్ ఫైర్’ ( బాబా వంగా డబుల్ ఫైర్ ప్రిడిక్షన్ ) గురించిన అంచనా ఆగస్టులో నిజం అవుతుందా.. ఈ నెలలో ఏదైనా చెడు జరగబోతోందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.

‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని పిలువబడే బాబా వంగా వేసిన భవిష్యత్ గురించి అంచనాలు అస్పష్టంగా ఉంటాయి.. అయినా అవి భయాందోళనలను కలిగిస్తాయి. ఇప్పుడు ఆమె చేసిన ‘డబుల్ ఫైర్’ అనే వాదన ప్రజలకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది. స్వర్గం, భూమి నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉదయిస్తుందని ఆమె చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఈ జ్యోస్యానికి భిన్నమైన అర్థాలను చెబుతున్నారు.

‘డబుల్ ఫైర్’ అంటే అర్థం ఏమిటి? కొంతమంది ఒకేసారి రెండు భౌతిక విపత్తులు సంభవించవచ్చని నమ్ముతున్నారు. ఇది కార్చిచ్చులు, అంతరిక్ష సంబంధిత సంఘటనలు లేదా మరేదైనా కావచ్చు. వాతావరణ పరిశోధకులు కార్చిచ్చులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించిన సమయంలో ఈ అంచనా వెలుగులోకి వచ్చింది. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. మరికొందరు ‘డబుల్ ఫైర్’ అంటే ‘భూమిపై నిప్పు’ అని భయంకరమైన అడవి మంటలు అని చెబుతున్నారు. అదే సమయంలో మరికొందరు ప్రజలు ‘ఆకాశం నుంచి వచ్చే అగ్ని శిఖలు, ఉల్కలు లేదా సూర్యుడి నుంచి లువడే శక్తివంతమైన సౌర జ్వాల అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే భయాందోళనలో ప్రపంచం బాబా వంగా ‘డబుల్ ఫైర్’ అంచనా కారణంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు ఎందుకంటే 2025 లో అమెరికా, కెనడా, యూరప్‌లలో భారీ అటవీ అగ్నిప్రమాదం జరిగింది. దీనితో పాటు అంతరిక్ష సంస్థలు కూడా ఉల్కల గురించి అనేక షాకింగ్ వాదనలు చేశాయి.

దైవ సందేశానికి చిహ్నం! చాలా మంది దీనిని ప్రతీకాత్మకంగా కూడా పరిగణిస్తున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం, ‘డబుల్ ఫైర్’ అనేది ఏదో ఒక దైవిక సందేశానికి చిహ్నంగా భావిస్తున్నారు. అయితే భూమి, అగ్ని అనేది యుద్ధం, పర్యావరణ నష్టం , నైతిక క్షీణత వంటి మానవ తప్పులను సూచిస్తుంది.

5079 వరకు జరిగే సంఘటనల అంచనా వేసిన బాబా వంగా బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. ఆమె 1911లో జన్మించింది. మరణానికి ముందు 5079 సంవత్సరం వరకు ప్రపంచంలో జరగనున్న సంఘటనలను ఆమె అంచనా వేసింది. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. ఆమె చెప్పిన సోవియట్ యూనియన్ పతనం , 9/11 దాడులు, చెర్నోబిల్ విపత్తు వంటి అంచనాలు నిజం అయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..