AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: భయంకరమైన జీవులు భూ గ్రహానికి వస్తారు! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా భవిష్యవాణి

ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వాంగా 2025 గురించి చేసిన భవిష్యవాణి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె అంచనాల ప్రకారం, 2025లో గ్రహాంతర వాసులతో పరిచయం, విధ్వంసకర సంఘటనలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించే అవకాశం ఉంది. క్యాన్సర్‌కు కూడా ఒక అపూర్వమైన సంవత్సరంగా 2025 ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆమె అంచనాలు నిజమవుతాయా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం.

Baba Vanga: భయంకరమైన జీవులు భూ గ్రహానికి వస్తారు! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా భవిష్యవాణి
Baba Vanga
SN Pasha
|

Updated on: Mar 19, 2025 | 9:40 AM

Share

ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వాంగ బతికున్న సమయంలో చెప్పిన ఓ భవిష్యవాణి ఇప్పుడు మానవాళిని భయపెడుతోంది. బల్గేరియా దేశానికి చెందిన ఒక కాలజ్ఞానిగా బాబా వాంగకు చాలా పెద్ద పేరుంది. ఆమె చెప్పిన జోస్యం చాలా సందర్భాలలో నిజమైందని ఆమె అనుచరులు, అభిమానులు చెబుతుంటారు. ఆమె బతికున్నప్పుడు చాలా మంది ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేస్తారని బాబా వాంగను చాలా మంది విశ్వసిస్తారు. ఆమె 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. ఆమె చిన్నతనంలో ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి.

అయితే ఆమె 2025లో సంభవించే పలు పరిణామాల గురించి అంచనా వేశారు. ఈ ఏడాదిలోనే మానవులకు, గ్రహాంతర వాసులకు మధ్య పరిచయం ఏర్పుడుతుందని పేర్కొన్నారు. అలాగే 2221లో మన భూ గ్రహంపైకి భయంకరమైన జీవులు వస్తారని కూడా బాబా వాంగ పేర్కొన్నారు. వారిని చూస్తేనే మానవాళి వణికిపోతుందని అన్నారు. అలాగే 2025లో వరుస విధ్వంసకర సంఘటనలు జరుగుతాయని బాబా వెంగా హెచ్చరించారు. ఆమె ఈ సంఘటనలను విపత్తు ప్రారంభంగా అభివర్ణించారు. మానవులు పూర్తిగా అంతరించిపోతారనే భయాలను కూడా ఆమె వ్యక్తం చేశారు.

బాబా వాంగ ప్రకారం, 2025లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పలు వస్తాయి. మానవులు ప్రయోగశాలలో కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేస్తారని ఆమె అంచనా వేశారు. అంతేకాకుండా, ఈ ఏడాది క్యాన్సర్‌కు అపూర్వమైన సంవత్సరం అవుతుందని కూడా వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో, రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు పేర్కొంది. సో.. అన్ని బాబా వాంగ చెప్పినట్లే జరుగుతున్నాయని, భవిష్యత్తులో కచ్చితంగా గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తారని చాలా మంది విశ్వసిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.