AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

నాసా ఆస్ట్రోనాట్లు సునీతా విలియమ్స్, విక్టర్ గ్లోవర్ ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన తర్వాత, స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. ఈ రెస్క్యూ మిషన్ కోసం 140 మిలియన్ డాలర్లు (సుమారు 1200 కోట్ల రూపాయలు) ఖర్చు అయ్యింది. డ్రాగన్ క్యాప్సుల్ అధునాతన సాంకేతికత, భద్రతా లక్షణాలే ఈ అధిక ఖర్చుకు కారణం.

Sunita Williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
Sunita Williams
SN Pasha
|

Updated on: Mar 19, 2025 | 8:35 AM

Share

నాసా ఆస్ట్రోనాట్స్‌ సునీతా విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కి కేవలం ఎనిమిది రోజుల మిషన్‌ కోసం వెళ్లారు. అయితే, సాంకేతిక లోపాల కారణంగా స్టార్‌లైనర్ సెప్టెంబర్‌లో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది. దీంతో విలియమ్స్‌, విల్మోర్‌ ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి వారిని భూమిపైకి తీసుకొచ్చే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ బాధ్యతలను స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు అప్పగించారు.

దీంతో స్పేస్‌ ఎక్స్‌, నాసా కలిసి సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లను భూమిపైకి తీసుకొచ్చేందుకు డ్రాగన్‌ క్యాప్సుల్‌ అనే వ్యోమనౌకను నింగిలోకి పంపారు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు చేరుకున్న వ్యోమనౌక్‌.. సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లను తీసుకొని బుధవారం(మార్చ్‌ 19) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగింది. ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌లు సురక్షితంగా భూమిపై దిగారంటూ నాసా ప్రకటించింది. అయితే.. వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. క్రూ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను నింగిలోకి పంపి, వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు ఏకంగా 140 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేశారు.

మన కరెన్సీలో దాదాపు రూ,1,200 కోట్లపై మాటే. ఇంత భారీగా ఖర్చు చేయడానికి కారణం ఆ వ్యోమనౌకలో ఏర్పాటు చేసిన అనేక పరికరాలు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, 2024 నాటికి ఒక్కో ప్రయోగానికి దాదాపు $69.75 మిలియన్లు ఖర్చు చేసేది. అయితే, వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రూపొందించబడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను దాదాపు 140 మిలియన్ల డాలర్ల ఖర్చుతో రూపొందించారు. అదనపు బరువు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర కీలకమైన మానవ-రేటెడ్ భద్రతా భాగాలను ఇందులో ఏర్పాటు చేయడంతో ఇంత భారీగా ఖర్చు అయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..