AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubhanshu Shukla: భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీమ్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు తిరిగి భూమికి చేరుకుంది. స్పేస్ నుంచి సోమవారం డ్రాగన్‌ వ్యోమనౌకలో బయలుదేరిన ఈ బృందం.. 22 గంటలకుపైగా ప్రయాణించి కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో దిగింది. శుభాంశు టీమ్ క్షేమంగా భూమికి చేరుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Shubhanshu Shukla: భూమిపై ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా బృందం
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2025 | 3:25 PM

Share

అంతరిక్షంలో 18 రోజుల పాటు ప్రయాణించి, అమెరికా కాలిఫోర్నియా తీరంలో విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టిన Ax-4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఆయన ఒకరు. అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంలో (ISS) దాదాపు రెండు వారాలకుపైగా శాస్త్రీయ పరిశోధనలతో గడిపిన అనంతరం, శుభాంశుతో పాటు మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులు డబ్లిన్ సమీపంలోని సముద్రంలో ల్యాండయ్యారు. ఈ ప్రయాణం యాక్సియం స్పేస్, నాసా, స్పేస్‌ఎక్స్ మళ్లీ మానవ అంతరిక్ష ప్రయాణాల్లో ముందడుగు వేసేలా చేసింది.

శుభాంశు శుక్లా మిషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రయోగాలు, ఇతర డేటా నాసాకు కీలకంగా ఉపయోగపడనున్నాయి. అంతరిక్షంలోని జీవన విధానం, శరీరంపై దాని ప్రభావం వంటి అంశాలపై ఆయన విశేష పరిశోధనలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

సోమవారం సాయంత్రం 4:30 గంటలకు స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అన్ డికింగ్ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. . వ్యోమగాముల బృందం 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. డాక్టర్ల పర్యవేక్షణలో.. భూమికి అలవాటు పడిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లింది. 28 గంటల ప్రయాణం అనంతరం ‘ఐఎస్‌ఎస్‌’లోకి ప్రవేశించింది. 18 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో వారు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిపారు. మొత్తం 60 ప్రయోగాలు చేశారు. వీటిలో ఇస్రో తరపున శుభాంశు శుక్లా 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు. అలాగే నాసా నిర్వహించిన మరో 5 జాయింట్ స్టడీస్‌లోనూ శుక్లా పాల్గొన్నారు. శుక్లా నిర్వహించిన 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాల డేటాను విశ్లేషించడానికి, ఐఎస్ఆర్ఓ, ఇతర సంస్థల శాస్త్రవేత్తలకు కనీసం 6 నెలల నుంచి ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు అని నిపుణులు తెలిపారు. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. మొదటి సారి 1984లో రాశేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజుల పాటు ఉండి తిరిగి వచ్చారు. 41 ఏళ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించారు.