న్యూయార్క్, ఫిబ్రవరి 2: అమెరికాలోని ఒహియోలో భారతీయ సంతతి విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఒహియోలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అమెరికా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకెళ్తే..
భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మృతి చెందిన విద్యార్ధి శ్రేయాస్ రెడ్డి బెణిగేరిగా గుర్తించారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గత కారణాలు తెలియరాలేదని వారు చెప్పారు. అంతకుమించిన వివరాలేవీ వెల్లడించలేదు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత్ కాన్సులేట్ జనరల్ తెలిపారు. సిన్సినాటిలోని ‘లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో శ్రేయాస్ రెడ్డి చదువుతున్నారు. శ్రేయాస్‌రెడ్డి సిన్సినాటి (ఓహియో)లో మృతి చెంది కనిపించారు. అతని మృతికి సంబంధించిన సమాచారం అతని తల్లిదండ్రులకు అందించామని, వారు భారత్ నుంచి రానున్నారని కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి.
శ్రేయాస్‌రెడ్డి మృతికి సంబంధించి న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. శ్రీ శ్రేయాస్ రెడ్డి దురదృష్టవశాత్తూ మృతి చెందాడని, అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణ జరుగుతోందని వెల్లడించారు. కాన్సులేట్ మృతుడి కుటుంబంతో తాము టచ్‌లో ఉన్నామని, వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. కాగా జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో ఇటీవలే వివేక్ సైనీ అనే భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వారం రోజుల్లో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి చెందడం తీవ్ర చర్చకు దారి తీసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.