AP, Telangana News Live: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్..!
Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌ను వానలు విడవడం లేదు. నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రలో జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోనూ వాన దంచికొడుతుంది.

జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ. ఇవి అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతున్నాయన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్యతరగతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు. దీని వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధాని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత దోహదం చేస్తామన్నారు.పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని.. ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
మరోవైపు దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఏడాది కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ తగ్గింపు మధ్య తరగతి ప్రజలకు డబుల్ బొనాంజా లాంటిదన్నారు. ఐటీ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందన్నారు.
2014లో దేశసేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రజాహితం కోసం GSTని ప్రాధాన్యతగా చేసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రతి వాటాదారుడితో చర్చించి వారి సందేహాలు తీర్చామని.. సమస్యలు పరిష్కరించామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తా కథనాలు ఇక్కడ తెలుసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE NEWS & UPDATES
-
దేవరకొండ బస్తీలో మేయర్..
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర కాలనీ డివిజన్‌లో ఉన్న దేవరకొండ బస్తీ నీట మునిగింది. నాలా ఉప్పొంగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. హైడ్రా అధికారులతో కలిసి బస్తీకి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ఇబ్బందులు పడుతున్న బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని వరద నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
-
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్!
గోదావరి నదిపై తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి NOC జారీ చేయాలని సీఎంను ఆయన కోరారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తామని, అలాగే సహాయ పునరావాస కార్యక్రమాలు చేపడతామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్ సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు.
-
-
జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్ ప్రారంభం – మోదీ
దేశవ్యాప్తంగా నేటి నుంచి జీఎస్టీ సేవింగ్ ఫెస్టివల్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ విడుదల చేశారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు సహా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. ఈ సంస్కరణలు ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, ప్రతి రాష్ట్రం పురోగతిని వేగవంతం చేస్తాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో తీసుకొచ్చే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు ప్రజలందరిలో పొదుపును పెంచుతాయని ఆయన హామీ ఇచ్చారు.
-
చెరువుల్లా మారిన రోడ్లు..
హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అయితే ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఒకేసారి బయటకు రావొద్దని సూచించారు. అలా వస్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తదని చెబుతున్నారు.
-
ఓజీ మూవీ సెన్సార్ కంప్లీట్..
ఓజీ మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా రన్‌టైమ్ 154 నిమిషాలు కాగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, సుజీత్ మేకింగ్, తమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది.
-
-
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కోవింద్..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్ల వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అక్టోబరు 2న విజయదశమి రోజు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు సంఘ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ వేడుకలకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది.
-
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలవడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
-
రణబీర్‌పై కేసు నమోదు చేయండి..
రణబీర్ కపూర్‌పై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్‌లో రణబీర్ అతిథి పాత్ర పోషించారు. ఎటువంటి వార్నింగ్ సైన్ లేకుండా రణబీర్ ఇ- సిగరెట్ కాలుస్తూ నటించడంపై వినయ్ జోష అనే వ్యక్తి ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించి కమిషన్ రణ్‌బీర్ సహా నిర్మాతలు, దాన్ని స్ట్రీమింగ్ చేసిన ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌పై చర్యలు తీసుకోవాంటూ ముంబై పోలీసులను ఆదేశించింది.
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సికింద్రాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, సుచిత్రలో జోరు వాన పడుతోంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోనూ వాన దంచికొడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
-
బీ అలర్ట్.. వచ్చే 3 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌ను వానలు విడవడం లేదు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో దంచికొట్టిన వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాతారణ శాఖ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాబోయే 3 గంటల్లో హైదరాబాద్‌లో వర్షం పడుతుందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
-
ఫ్లైట్‌లో ప్రయాణికుడి హంగామా.. కాక్‌పిట్ డోర్ తెరిచే ప్రయత్నం..
బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగానే.. అతడు కాక్‌పిట్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విమానం సురక్షితంగా వారణాసి చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
-
పవన్ ఓజీ ట్రైలర్ రిలీజ్..
పవన్ కల్యాణ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఓజీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్స్, సుజీత్ మేకింగ్, తమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది.
-
పాకిస్థాన్: లాలిబాన్‌లే లక్ష్యంగా పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్
అఫ్ఘాన్ సరిహద్దులోని కైబర్ పక్తూంఖ్వా ప్రాంతంలోని తిరాహ్ వ్యాలీపై దాడులు
(PAF) JF-17 ఫైటర్ జెట్‌ల 8 LS-6 బాంబులతో విచుకు పడిన పాక్ ఆర్మీ
పాక్ ఆర్మీ వైమానిక దాడుల్లో 30 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం
ఘటనా ప్రాంతంలో ధ్వంసమైన గృహాలు, 20 మందికిపైగా గాయాలు
-
సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం
సింగరేణి లాభం రూ.2,360 కోట్లు
లాభాల్లో 34 శాతం కార్మికులకు బోనస్‌గా ప్రకటించిన సర్కార్
ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1,95,610 బోనస్
కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్
మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.819 కోట్ల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం
-
మోదీ బయోపిక్ కొత్త పోస్టర్ విడుదల
ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కతున్న ‘మా వందే’ సినిమా
మోదీ పాత్రలో కనిపించనున్న ప్రేక్షకుల ముందుకు రానున్న నలుడు ఉన్ని ముకుందన్
నేడు ఉన్న ముకుందన్ జన్మదినం సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ విడుదల

-
భారత ఐటీ షేర్లపై హెచ్-1బీ ఫీజుల పెంపు ఎఫెక్ట్
హెచ్-1బీ వీసాల ఫీజు పెంపుతో కుప్పకూలిన భారత ఐటీ కంపెనీల షేర్లు
ఒక్కో వీసాకు భారత కరెన్సీలో రూ.88 లక్షలు చార్జ్ చేస్తున్న అమెరికా
అమెరికా ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే భారత మార్కెట్లపై ప్రభావం
ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే కుప్పకూలిన ఐటీ సూచీలు
5 నుంచి 8 శాతం పడిపోయిన సీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు
-
జీఎస్టీ కొత్త సంస్కరణలపై ప్రాధానికి ఏపీ నేతల కృతజ్ఞతలు
దేశంలో జీఎస్టీ 2.0 అమలుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
భారత ఆర్థిక వ్యవస్థకు ఇది శుభదినమన్న పవన్ కల్యాణ్
దేశంలో పన్నుల విధానం సరళతరమైందని మంత్రి లోకేష్ వ్యాఖ్య
-
హెచ్-1 బీకి చెక్ చైనా సరికొత్త వీసా విధానం
విదేశీ నిపుణుల కోసం చైనా సరికొత్త ‘కే-వీసా’ విధానం
సైన్స్, టెక్నాలజీ, స్టెమ్ రంగాల్లోని యువతే లక్ష్యం గా కొత్త వీసా రూపొందించిన చైనా
అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త వీసాలు
అమెరికా హెచ్-1బీ రూల్స్ కఠినతరం చేస్తుండడంతో నిర్ణయం
-
బీఆర్ఎస్ టార్గెట్‌గా కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్
అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై BRS నడుస్తుందా: బండి సంజయ్
లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు- బండి సంజయ్
కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో లగ్జరీ కార్లు ఎందుకు రిజిస్టర్ అయ్యాయి- బండి సంజయ్
మార్కెట్ ధర చెల్లించారా తక్కువ ధరకు తీసుకున్నారా?: బండి సంజయ్
పేమెంట్లు బినామీ పేర్లతోనా.. నకిలీ ఆదాయమా? : బండి సంజయ్
ఈ స్కామ్‌లో KCR ఫ్యామిలీ ప్రయోజనం పొందినట్టు కాదా.. సంబంధిత శాఖలు దర్యాప్తు జరపాలి- బండి సంజయ్
-
జీఎస్టీ తగ్గింపుపై భారీ ప్రచార వ్యూహంలో బీజేపీ
ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లోని మార్కెట్లను సందర్శించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశం
జీఎస్టీ రేట్ల తగ్గింపుపై ఈ నెల 29 వరకు ప్రచారం
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
బీజేపీ సంస్థాగత స్థాయిలో అక్టోబర్ 15 వరకు ప్రచారం
కేంద్రం నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం
-
విశాఖలో 28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
ప్రతిష్టాత్మకమైన ఈ-గవర్నెన్స్ సమ్మిట్‌కు దేశ నలుమూలల నుంచి 12వందల మంది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ నిపుణులు హాజరు
వికసిత్ భారత్, సివిల్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ థీమ్‌తో సమ్మిట్
సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబునాయుడు
-
మూడో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
క్వశ్చన్ అవర్‌తో ప్రారంభమైన శాసనసభ
క్వశ్చన్ అవర్ తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగం
వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర
మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, రాష్ట్రంలో గ్రంథాలయాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలపై మండలిలో ప్రకటన చేయనున్న ఆర్థికమంత్రి పయ్యావుల
-
ఏపీ శాసనమండలి వాయిదా
చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో వైసీపీ నిరసన
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు
వైసీపీ సభ్యుల ఆందోళనతో మండలి వాయిదా
-
గుంటూరులో తీవ్ర విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు: అశోక్ నగర్‌లోని లేడీస్ హాస్టల్‌లో విద్యార్ధిని ఆత్మహత్య
అర్ధరాత్రి నోటికి ప్లాస్టర్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని
ఘటన స్థలానికి చేరుకున్న పట్టాభిపురం పోలీసులు
మృతురాలు VVIT కాలేజీ విద్యార్ధినిగా గుర్తింపు
విద్యార్థిని ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీం
ఇంజనీరింగ్ 4th చదువుతున్న ఏలూరుకు చెందిన కావ్య
రాత్రి చివరిసారి తల్లిదండ్రులు ఫోన్ చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన కావ్య
-
AP Assembly: ఏపీ అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై కీలక చర్చ
వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర
మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, రాష్ట్రంలో గ్రంథాలయాలపై చర్చ
జీఎస్టీ సంస్కరణలపై మండలిలో ప్రకటన చేయనున్న ఆర్థికమంత్రి పయ్యావుల
ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు
-
PM Modi: మీకు ఇష్టమైన పాటను పంచుకోండి.. నవరాత్రి సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
తనకు నచ్చిన పాటను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ప్రధాని
నవరాత్రి అనేది స్వచ్ఛమైన భక్తికి సంబంధించిన పండుగ: మోదీ
చాలా మంది ఈ భక్తిని సంగీతం ద్వారా వ్యక్తపరిచారు: మోదీ
పండిట్ జస్రాజ్ స్వరపరిచిన అలాంటి ఒక మనోహరమైన భజనను నేను పంచుకుంటున్నాను: మోదీ
మీరు ఏదైనా భజన పాడినట్లయితే లేదా మీకు ఇష్టమైనది ఉంటే, దయచేసి నాతో పంచుకోండి : మోదీ
రాబోయే రోజుల్లో వాటిలో కొన్నింటిని నేను పోస్ట్ చేస్తాను: మోదీ
-
ఇంద్రకీలాద్రి పై అంతరాలయ దర్శనాలు రద్దు
దసరా ఉత్సవాలకు కనీసం 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
మూలానక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వనున్న సీఎం
సాధారణ భక్తుల సౌకర్యార్థం రూ. 500 దర్శనాలు రద్దు
అందుబాటులో 300,100 టికెట్ ఉచిత దర్శనాలు
ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న దసరా మహోత్సవాలు
స్లాట్ ప్రకారమే వీఐపీ దర్శనాలు
ఉదయం ఏడు నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల మధ్య వీఐపీ దర్శనాలు
వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక ఏర్పాట్లు
-
Telangana: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలి!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో అక్కడ ర్యాగింగ్ భూతానికి ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. మేడ్చల్‌లో ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు. నారపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లో ఉరి వేసుకోవడం కలకలం రేపుతోంది. సాయితేజ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించి, ఒక బార్‌లో 10 వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఆ వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు సాయితేజ. ఈ వీడియో ప్రకారం సాయి తేజది ఆత్మహత్య కాదు హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సాయితేజ తండ్రి ప్రేమ్ సింగ్ చెబుతున్నారు.
-
బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలూరి, విశాఖ, అవకాపల్లి, చిత్తూరు. తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
-
వణుకు పుట్టిస్తున్న వరుస అల్పపీడనాలు
ఉత్తర బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
ఈ నెల 25న మరో అల్పపీడనం
రాష్ట్రంలో 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు
వేటకు వెళ్ళిన మత్స్యకారులు తిరిగిరావాలని సూచన
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.
శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం.
ఒక కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,408 మంది భక్తులు.
హుండీ ఆదాయం రూ. 3.73కోట్లు
-
దేశ వ్యాప్తంగా అమల్లోకి జీఎస్టీ 2.0 సంస్కరణలు.
తగ్గిన టెక్స్‌టైల్స్, షూస్ ధరలు
తగ్గిన పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, నోట్‌బుక్స్, మ్యాప్స్, గ్లోబ్స్, ఎరేసర్ల ధరలు
తగ్గిన లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, యోగా జిమ్ సర్వీసెస్, బ్యార్బర్/సెలూన్ సర్వీసెస్, మెడిసిన్స్, బ్యాటరీల ధరలు
లగ్జరీ ఉత్పత్తులు, ఎరేటెడ్ డ్రింక్స్, పొగాకు పై 40శాతం పన్నులు
ఇంకా అమలులోకి రాని 40శాతం పన్ను స్లాబు
-
ఇంద్రకీలాద్రి పై నేటి నుండి దసరా శరణవరాత్రుల
మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది 11 రోజులు 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ
ఇవాళ 8 గంటల నుండి ప్రారంభం కానున్న దర్శనాలు
-
కొత్త జీఎస్టీలో స్లాబులు
తగ్గిన పాలు,నెయ్యి, పన్నీర్, చీజ్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ,ఫ్రూట్ జ్యూస్ ధరలు
తగ్గిన సబ్బులు, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, టాల్కం పౌడర్ ధరలు
ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టీవీలు (LCD/LED), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు పై 5-10వేల వరకు తగ్గింపు
కార్లు (హ్యాచ్‌బ్యాక్, SUVలు), 350సీసీ వరకు బైకులు పై 50వేల నుంచి లక్ష వరకు తగ్గింపు
రూ.50,000-1.5 లక్షలు తగ్గిన మారుతి, మహీంద్రా, కియా, స్కోడా కార్ల ధరలు
-
కొత్త జీఎస్టీలో స్లాబులు
గతంలో 12 శాతం స్లాబులోని 99శాతం వస్తువులు 5 శాతం పన్ను స్లాబులోకి మారింది.
28 శాతం స్లాబులోని 90 శాతం వస్తువులుపై 18 శాతంలోకి మార్పు.
జీఎస్టీ పన్ను రేట్లు తగ్గడంతో తగ్గిన వస్తువుల ధరలు
వస్తువు ధర పై అమలు కానున్న నూతన పన్ను రేటు
-
మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల
ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడోరోజు నేడు
ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనసభ
ఈరోజు అసెంబ్లీ లో పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
-
GST 2.0: దేశ వ్యాప్తంగా అమల్లోకి జీఎస్టీ 2.0 సంస్కరణలు.. భారీ తగ్గిన వస్తువుల ధరలు!
దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఇకపై 5,18,40 శాతం పన్ను స్లాబులు ఉండనున్నాయి. ఈ కొత్త సవరణలతో 350 పైగా వస్తువులపై పన్ను తగ్గనుంది. జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతి, సామాన్యులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఈ కొత్త జీఎస్టీతో ఆహారం, పాల ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, వస్త్రాలు, ఫుట్ వేర్, విద్యా సామాగ్రి, ఆరోగ్యోపకరణాల ఇలా చాలా వస్తువులపై ధరలు తగ్గాయి.
Published On - Sep 22,2025 6:45 AM
