Sri Lanka: ఆర్థిక సంక్షోభం మరింత జఠిలం కాకుండా శ్రీలంక కీలక నిర్ణయం.. 300 వస్తువుల దిగుమతిపై నిషేధం..

| Edited By: Janardhan Veluru

Aug 24, 2022 | 5:05 PM

విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరత దేశాల నుంచి చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్..

Sri Lanka: ఆర్థిక సంక్షోభం మరింత జఠిలం కాకుండా శ్రీలంక కీలక నిర్ణయం.. 300 వస్తువుల దిగుమతిపై నిషేధం..
Srilanka Ban 300 items
Follow us on

Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరత దేశాల నుంచి చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, షాంపూలతో సహా 300 వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దేశం దగ్గరున్న విదేశీ మారకద్రవ్యం నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో శ్రీలంయ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీప దేశం.. తీవ్ర  విదేశీ మారకద్రవ్యం కొరత నెలకొంది. దీంతో డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర నిత్యావరసర వస్తువులను కొనలేని దుస్థితి నెలకొంది.  దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ప్రజా ఆందోళనల కారణంగా గొటబయ రాజపక్స్ ప్రభుత్వం సైతం దిగిపోవల్సి వచ్చింది. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం శ్రీలంకను సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కించే చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, షాంపూలు, మేకప్ కు సంబంధించిన వస్తువులతో పాటు మొత్తం 300 రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. అయితే  ఆగష్టు 23లోపు ఎగుమతి జరిగి సెప్టెంబర్ 14వ తేదీ లోపు తమ దేశానికి చేరుకునే ఈ వస్తువులకు అనుమతి ఉంటుందని శ్రీలంక వెల్లడించింది. విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తోంది. ఈఅంశంపై శ్రీలంక అధికారులు IMF తో చర్చలు జరుపుతున్నారు. ఈఏడాది చివరి నాటికి ఐఎంఎఫ్ ప్యాకేజీ అందుబాటులోకి వస్తుందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఫారెక్స్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ రుణాన్ని తీర్చలేమని ఈఏడాది ఏప్రియల్ లో శ్రీలంక ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..