యోగాపై నిషేధం.. అలబామా సభ ఎత్తివేత.. ‘నమస్తే’ కి మాత్రం నో !
అమెరికాలోని అలబామాలో దశాబ్దాల కాలంగా యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. భారతీయ యోగాసనాల ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ చర్య తీసుకున్నప్పటికీ.. 'నమస్తే' సంప్రదాయాన్ని బ్యాన్ చేశారు.
అమెరికాలోని అలబామాలో దశాబ్దాల కాలంగా యోగాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. భారతీయ యోగాసనాల ప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యాన్ని గుర్తించి ఈ చర్య తీసుకున్నప్పటికీ.. ‘నమస్తే’ సంప్రదాయాన్ని బ్యాన్ చేశారు. అసలే కరోనాతో ప్రపంచ దేశాలు సతమతమవుతుండగా.. ఆయా దేశాధినేతలు ఈ వైరస్ నివారణకు ఇదే (నమస్తే) బెటరని భావిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు విరుధ్ధంగా అలబామా సభ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 1993 లో స్కూళ్లలో యోగాను, హిప్నాసిస్ ను, మెడిటేషన్ ను నిషేధిస్తూ..నాడు కన్సర్వేటివ్ లతో కూడిన అలబామా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓటింగ్ నిర్వహించింది. ఆ ఓటింగులో ఈ నిషేధాలకు అనుకూలంగా మెజారిటీ ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా.. ఇటీవల అలబామా ప్రజా ప్రతినిధుల సభలో జెరెమీ గ్రే అనే డెమొక్రటిక్ సభ్యుడు.. యోగాపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ..’యోగాబిల్లు’ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. దీనికి అనుకూలంగా 84, వ్యతిరేకంగా 17 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు సభ ఆమోదం పొందింది. ఓ వైపు నమస్తే ని బ్యాన్ చేస్తూనే. మరోవైపు యోగాపై నిషేధాన్ని ఎత్తివేయడం విశేషం. ఇక ఈ బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి ఆ సభలో ఆమోదం లభించి.. గవర్నర్ సంతకం పెట్టిన పక్షంలో అది చట్టమవుతుంది. స్కూళ్లలో యోగా మీద 27 ఏళ్లుగా ఉన్న బ్యాన్ పూర్తిగా అంతమవుతుంది.