Kabul Airport Explosions: ‘ఆఫ్గన్‌లను చంపడం ఆపండి.. దారుణ పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేయకండి’: స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
Rashid Khan: కాబూల్‌లో జరిగిన పేలుడుతో ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈ పేలుడుపై స్పందిస్తూ..
Rashid Khan: కాబూల్‌లో జరిగిన పేలుడుతో ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈ పేలుడుపై స్పందిస్తూ, ‘ఆఫ్గన్‌లను చంపడం ఆపండి’ అంటూ కోరుతున్నాడు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘కాబూల్‌లో మళ్లీ రక్తస్రావం అవుతోంది. దయచేసి ఆఫ్గన్‌లను చంపడం ఆపండి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మమ్మల్ని వదలకండి” అంటూ రాసుకొచ్చాడు
ఫిదాయీన్ దాడుల్లో 80 మందికి పైగా మరణించారు. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముందు గురువారం సాయంత్రం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ పేలుళ్లలో 80 మంది మరణించారు. అలాగే ఇందులో 200 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది యూఎస్ మెరైన్ కమాండర్లు కూడా ఉన్నారు. వీరితో పాటు 15 మంది గాయపడ్డారు. వార్తా సంస్థ ప్రకారం.. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎకు చెందిన ఖోరాసన్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొంది.
కాబూల్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ తెలిపారు. అధికారుల ప్రకారం, అక్కడ మరిన్ని దాడులు జరగవచ్చనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వన్డేల్లో 100 కి పైగా వికెట్లు.. ఆఫ్గనిస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఆడిన 74 మ్యాచ్‌లలో రషీద్ ఖాన్ 4.18 ఎకానమీ రేటుతో 140 వికెట్లు పడగొట్టాడు. అలాగే 51 టీ 20 ల్లో 6.21 ఎకానమీ రేటుతో 95 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు కూడా సిద్ధంగానే ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నాడు.
Kabul is bleeding again ???? STOP KILLING AFGHAN PLEASE ????????
— Rashid Khan (@rashidkhan_19) August 26, 2021
Also Read:
Kabul Blast: కాబుల్ రక్తసిక్తం.. 73 మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసులు.. అమెరికా దళాలే టార్గెట్..
Afghan Crisis: కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుళ్లు.. 72 మంది దుర్మరణం..