Panjshir – Taliban: తాలిబన్లపై పంజ్ షీర్ సమరశంఖం.. తలొగ్గేది లేదంటున్న గెరిల్లా యోధులు..

తాలిబన్లపై పంజ్ షీర్ సమరశంఖం పూరించింది. తాలిబన్లకు తలొగ్గేది లేదని యోధులు ప్రకటించారు. వీరికి ఆఫ్ఘన్ ప్రజలతో పాటు, తజకిస్థాన్ కూడా మద్ధతు తెలిపింది. గత పోరాటాల్లో ప్రతాపాన్ని చూపిన గెరిల్లా యోధులు..

Panjshir - Taliban: తాలిబన్లపై పంజ్ షీర్ సమరశంఖం.. తలొగ్గేది లేదంటున్న గెరిల్లా యోధులు..
Tajikistan Panjshir
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 27, 2021 | 1:36 PM

తాలిబన్లపై పంజ్ షీర్ సమరశంఖం పూరించింది. తాలిబన్లకు తలొగ్గేది లేదని యోధులు ప్రకటించారు. వీరికి ఆఫ్ఘన్ ప్రజలతో పాటు, తజకిస్థాన్ కూడా మద్ధతు తెలిపింది. గత పోరాటాల్లో ప్రతాపాన్ని చూపిన గెరిల్లా యోధులు.. మళ్లీ రణానికి సిద్ధమయ్యారు. తాలిబన్లతో రాజీపడే ఉద్దేశ్యమే లేదని, వారి అంతు చూస్తామని ప్రకటించారు. తాలిబన్లపై పోరాడేందుకు ఆర్మీ మాజీ కమాండర్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఆఫ్గన్ ప్రజలు కూడా వారికే మద్దతుగా నిలుస్తున్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో నాడు సోవియట్ యూనియన్ నుంచి నేడు తాలిబన్ల వరకు ఎవరికీ పంజ్ షిర్ యోధులు తలొగ్గడం లేదు. దేశం మొత్తాన్ని కంట్రోల్ లోకి తీసుకున్నప్పటికీ.. ఈ లోయలోకి ప్రవేశించడానికి ధైర్యం చాలడం లేదు. మొక్కవోని సంకల్పంతో తాలిబన్లపై పోరాటానికి దిగారు.

తాజాగా వీళ్లకి తజకిస్థాన్ మద్ధతు ఇవ్వడంతో.. ఈ యోధులకు మరింత బలం చేకూరినట్టయింది. యుద్ధమంటే.. ఈ యోధులు అత్యంత తెగువ చూపిస్తారు. బయటివారు ఇక్కడికి ప్రవేశించలేనంతగా పంజ్ షీర్ ప్రాంతానికి భౌగోళిక అనుకూలతలు ఉన్నాయి. ఈ పర్వత ప్రాంతాల్లోకి శత్రువులు ప్రవేశిస్తే తిరిగి వెళ్లడం ఇక అసాధ్యమే.

తాలిబన్లు దురాక్రమణకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని పంజ్ షీర్ యోధులు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేదిలేదని హెచ్చరించారు. తాలిబన్ వ్యతిరేక నార్తర్న్ అలయెన్స్ కూడా పంజ్ షీర్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ప్రస్తుతం పంజ్ షీర్ లోయలోనే ఉన్నారు.

తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర ప్రావిన్స్ ల్లోని ప్రజలు కూడా పంజ్ షీర్ సాయుధులకు మద్దతు పలుకుతున్నారు. ఆఫ్ఘన్ తో సరిహద్దులు పంచుకుంటున్న తజకిస్థాన్ కూడా పంజ్ షీర్ యోధులకు సంఘీభావం తెలిపింది.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..