19 వేల ఉద్యోగాలు తొలగించనున్న మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. భారత్ పై ప్రభావం

Aravind B

Aravind B |

Updated on: Mar 24, 2023 | 10:01 AM

ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలిగించే బాటలో పడ్డాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు మొదలుకొని చిన్న కంపెనీల వరకు తమ ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఐర్లాండ్ కు చెందిన ఐటీ దిగ్గించి యాక్సెంచర్ కూడా ఈ జాబితాలో చేరింది.

19 వేల ఉద్యోగాలు తొలగించనున్న మరో ఐటీ దిగ్గజ కంపెనీ.. భారత్ పై ప్రభావం
Layoffs
Follow us

ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలిగించే బాటలో పడ్డాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు మొదలుకొని చిన్న కంపెనీల వరకు తమ ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఐర్లాండ్ కు చెందిన ఐటీ దిగ్గించి యాక్సెంచర్ కూడా ఈ జాబితాలో చేరింది. దాదాపు 19 వేల మంది ఉద్యోగులను తమ కంపెనీ నుంచి తొలగించనునన్నట్లు ప్రకటించింది. కంపెనీపై ఉన్న ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే కంపెనీ వార్షిక ఆదాయం, వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్వల్పంగా తగ్గించుకుంది. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 16.64 బిలియన్ డాలర్ల అంచనా నుంచి 16.1-16.7 బిలయన్ డాలర్ల అంచనాకు తగ్గించుకుంది. ఈ సారి ఆదాయాన్ని 8-10 శాతంగా అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఇది ఒక శాతం ఎక్కవ. అయితే వచ్చే 18 నెలల్లో ఉద్యోగాలను తొలిగిస్తామని వెల్లడించింది.

రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం వస్తుందనే అంచనాలతో చాలా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టి విషయం తెలిసిందే. పలు అమెరికన్‌ ఐటీ సంస్థలు భారతదేశంలోను కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. గతంలో ఆయా సంస్థలు లేఆఫ్‌లు విధించిన సమయంలో భారత్‌లోని ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో యాక్సెంచర్‌ ఉద్యోగాలను తొలగిస్తామని నిర్ణయించడంతో భారత్‌లో ఎంత మందిపై దీని ప్రభావం ఉంటుందనేది తెలియాల్సివుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu