AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదైనా ఆగని రష్యా ఉక్రెయన్ యుద్ధం.. ఉక్రెయన్ ను మళ్లీ నిర్మించాలంటే అంత ఖర్చు చేయల్సిందేనా..

ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతుంది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ రెండు దేశాలు తగ్గేదే లే అన్నట్టు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ యుద్దంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కవగా ధ్వంసం అయింది.

ఏడాదైనా ఆగని రష్యా ఉక్రెయన్ యుద్ధం.. ఉక్రెయన్ ను మళ్లీ నిర్మించాలంటే అంత ఖర్చు చేయల్సిందేనా..
Ukraine
Aravind B
|

Updated on: Mar 24, 2023 | 6:56 AM

Share

ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతుంది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ రెండు దేశాలు తగ్గేదే లే అన్నట్టు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ యుద్దంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కవగా ధ్వంసం అయింది. రష్యా తన క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలను నాశనం చేశాయి. ఈ క్రమంలో కొన్ని నగరాల ఆనవాళ్లు అసలు కనిపించకుండానే పోయాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ధ్వంసమైన ఉక్రెయిన్ ను మళ్లీ పునర్నిర్మించాలంటే సుమారు 411 బిలియన్ డాలర్లు అవసరం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.33 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న మాట. అలాగే ఉక్రెయిన్ లో కేవలం ధ్వంసమైన భవనాల శిథిలాల తొలగించేందుకే ఏకంగా 5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 40 వేల కోట్లు ఖర్చు అవుతుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.

అలాగే మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు దాదాపు 80లక్షలకు పైగా ఉక్రెయిన్ పౌరులు పేదరికంలోకి వెళ్లిపోయినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భవనాలు దెబ్బతినడంతో 135 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదికలో పేర్కొంది. సుమారు 20లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని అంచనా వేసింది. ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ఆర్థిక పరిణామాల వల్ల కలిగే నష్టం ఇందుకు మరింత తోడవుతుందని తెలిపింది. ఉక్రెయిన్‌ పునరుద్ధరణకు 349 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.28లక్షల కోట్లు ఖర్చవుతుందని గత సెప్టెంబర్‌లో లెక్క కట్టిన ప్రపంచ బ్యాంకు తాజాగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొంది. రష్యా ఇంకా క్షిపణి దాడులకు పాల్పడుతున్న కారణంగా రానున్న రోజుల్లో ఈ నష్టం భారీగా ఉండనుందని అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..