Video Viral: రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో..
యాక్సిడెంట్ అనేది అప్పటికప్పుడు జరిగిపోయే ఓ ఇన్సిడెంట్. రోడ్డుపై వెళ్లే సమయంలో మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటివారి అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డుపక్కన నిల్చున్న వారిపై...

యాక్సిడెంట్ అనేది అప్పటికప్పుడు జరిగిపోయే ఓ ఇన్సిడెంట్. రోడ్డుపై వెళ్లే సమయంలో మనం జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటివారి అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డుపక్కన నిల్చున్న వారిపై కూడా ప్రమాదాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రోడ్డుపై నడుస్తూ వెళ్లినా, వాహనాల్లో వెళ్తున్నా అప్రమత్తత అవసరం. లేకుంటే ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్సిడెంట్‌కు గురవుతామో.. ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం అటువంటి ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, ఇళ్లు, చెట్లు.. ఇలా అన్నింటిపై మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. అదే సమయంలో రైల్వే ట్రాక్ కూడా మంచులో కూరుకుపోయింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లు.. సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో 134 అడుగుల పొడవైన కాంక్రీట్ రెయిలింగ్‌తో ఒక ట్రక్కు రైలు గేట్‌ను దాటుతున్న చోట.. పెను ప్రమాదం జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ట్రక్ పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో స్పీడ్ గా వస్తున్న ఓ గూడ్స్ రైలు.. ఆ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలింగ్‌తో పాటు ట్రక్కు కూడా ధ్వంసమైంది. ట్రక్కు దాదాపుగా గేటు దాటేసింది. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేది. అనేక కోచ్‌లు దెబ్బతినడంతో పాటు ఇంజన్ కూడా బాగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.




Shocking moment train crashes into truck carrying massive concrete beam and derails pic.twitter.com/9KWAM3o2s3
— The Sun (@TheSun) December 21, 2022
ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలను అగ్నిమాపక శాఖ షేర్ చేసింది. ఈ ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే, రెస్క్యూ టీమ్ చేరుకుని మార్గాన్ని క్లియర్ చేయడం ప్రారంభించింది. ట్రక్కుకు జరిగిన నష్టం కంటే రైలుకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఢీకొన్న తర్వాత ఇంజిన్ నేలలో కూరుకుపోయింది. చాలా బోగీలు పట్టాలు తప్పాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..