Viral: మొదటిసారి ప్రియుడి ఇంటికెళ్లిన ప్రియురాలు.. కట్ చేస్తే.. ఆమె చేసిన పనికి అందరూ షాక్..
ఓ ప్రియురాలు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రియుడి ఇంటికి వెళ్లింది.. ఈ క్రమంలో బాత్రూం లోకి వెళ్లిన ప్రియురాలు.. అక్కడున్న టాయిలెట్ సింక్ పగులగొట్టింది.. అయితే, ఇలా ఎందుకు జరిగింది.. అనేది

ఓ ప్రియురాలు.. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రియుడి ఇంటికి వెళ్లింది.. ఈ క్రమంలో బాత్రూం లోకి వెళ్లిన ప్రియురాలు.. అక్కడున్న టాయిలెట్ సింక్ పగులగొట్టింది.. అయితే, ఇలా ఎందుకు జరిగింది.. అనేది ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. కెనాడాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. కెనడాలోని వాంకోవర్‌లో నివాసముంటున్న కెన్నెడీ కాల్వెల్ అనే 26 ఏళ్ల యువతి.. క్రిస్మస్ పండుగ కావడంతో తొలిసారిగా తన ప్రియుడి కుటుంబాన్ని కలవడానికి టొరంటో వెళ్లింది. ఇంటికి చేరుకోగానే ఆమె కడుపులో ఇబ్బందిగా అనిపించడంతో.. టాయిలెట్‌కి వెళ్లింది. టాయిలెట్‌కి వెళ్లిన అనంతరం ఫ్లష్ చేసేందుకు ప్రయత్నించింది. అలా చాలాసార్లు ఫ్లష్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫ్లష్ బటన్ పని చేయలేదు. ఈ సమయంలో కెన్నెడీ ఫ్లష్ సమస్యను తనంతట తానుగా పరిష్కరించాలనుకుంది. ఇలా దాన్ని సరిచేయడం ప్రారంభించింది. ఈ సమయంలో టాయిలెట్ సింక్ మొత్తం ముక్కలైంది. పెద్ద శబ్దంతో నేలపై విరిగిపడింది. టాయిలెట్ సింక్ పగిలిపోవడమేంటి అంటూ కెన్నడీ ఆందోళన చెందింది..
మొదటిసారి ప్రియుడి కుటుంబాన్ని కలవడానికి వెళ్ళిన క్రమంలో ఇలా జరగడమేంటీ.. ఈ ఘటనతో ప్రియుడి కుటుంబం ఏం ఆలోచిస్తుందో అంటూ బాధపడింది. ఎలాంటి దురాభిప్రాయం తలెత్తుతుందో.. అంటూ భయపడింది. ఈ సమయంలో కెన్నెడీ ఈ సంఘటనను వీడియో తీసి.. టిక్‌టాక్‌లో తన అనుచరులతో పంచుకుంది. ఇది చూసి నెటిజన్లు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్‌లో నవ్వుతూ కనిపించిన కాల్వెల్.. టాయిలెట్ సింక్ ముక్కలైన దృశ్యాలను చూపుతూ మొత్తం సంఘటనను వివరించింది. ఇప్పుడు నేను టాయిలెట్‌ను పగలగొట్టానని నా బాయ్‌ఫ్రెండ్‌కు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి.. చాలా ఇబ్బందిగా ఉంది అంటూ పేర్కొంది.
కెన్నెడీకి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేశారు. అక్కడ తప్పించుకోవడానికి పెద్ద కిటికీ ఉందా? అంటూ ఒకరు పేర్కొనగా.. ఇంటి నుంచి పారిపో అంటూ మరొకరు.. ఇలా ఎన్నో కామెంట్లు చేశారు. దీంతోపాటు ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.




అయితే.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కెన్నెడీ మరో వీడియోను కూడా పంచుకుంది.. ముందు ఇది తమాషాగా అనిపించింది. అంతా సవ్యంగా జరిగినందుకు నేను సంతోషిస్తున్నప్పటికీ.. నా టాయిలెట్ కథను 2.5 మిలియన్ల (25 లక్షల) కంటే ఎక్కువ మంది ప్రజలు వీక్షించారని తెలిసి ఇబ్బంది పడుతున్నాను.. అంటూ పేర్కొంది. మొదట ఇది పెద్ద విషయం కాదని అనుకున్నాను.. ఫ్లష్ సరిచేస్తున్న క్రమంలో సింక్ ముక్కలైందంటూ పేర్కొంది.

Canada Story
అయితే, ఇదంతా జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరని, తన ప్రియుడు మేడమీద ఉన్నాడని, ఇదంతా బేస్‌మెంట్‌లో జరిగిందని కెన్నెడీ తెలిపింది. తప బాయ్‌ఫ్రెండ్ నిక్‌కి ఇదంతా చెబితే.. అతను తనను చూసి చాలా నవ్వుకున్నాడని తెలిపింది. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను అనుకోకుండా టాయిలెట్ పగలగొట్టిందని చెప్పాడని.. ఇది విన్న నిక్ తల్లిదండ్రులు కూడా నవ్వుకున్నారని తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..