Trending Video: జొమాటో డెలివరీ బాయ్ డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. క్యూట్ వీడియో మీ కోసమే..
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రజల్లో ఓ రకమైన భావోద్వేగంతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బరాత్ తీసే సమయాల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పాదాలు వారి ప్రమేయం లేకుండానే...

పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రజల్లో ఓ రకమైన భావోద్వేగంతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా బరాత్ తీసే సమయాల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పాదాలు వారి ప్రమేయం లేకుండానే కదులుతుంటాయి. పెళ్లిళ్లలో డ్యాన్స్‌ను ఆపుకోలేని వాతావరణం ఏర్పడుతుంది. ఊరేగింపులో అందరూ ఉత్సాహంగా స్టెప్పులేస్తుంటే.. తెలియని వారు కూడా జాయిన్ అయ్యి కాలు కదుపుతుంటారు. అంతే కాకుండా ఎక్కడో పెళ్లిలో పాట ప్లే అవుతుంటే రోడ్డు మీద నిలబడి వింటూ డ్యాన్స్ చేయడం కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ డెలివరీ బాయ్ పెళ్లిలో ప్లే అవుతున్న పాటను విని రోడ్డుపై డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిని చూసేందుకు ఇష్టపడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ‘సప్నే మే మిల్తీ హై’ అనే పాట ప్లే అవుతోంది. ఆ పాట విన్న తర్వాత జొమాటో డెలివరీ బాయ్ బయట రోడ్డుపై డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సంగీతానికి హద్దులు ఉండవు అనడానికి ఉదాహరణగా.. డెలివరీ బాయ్ సంతోషంగా, ఉత్సాహంగా పాట వింటూ డ్యాన్స్ వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పుల్కిట్‌కొచార్ అనే ఐడితో పోస్ట్ అయింది. ఇప్పటివరకు 70 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. 6 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి