AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. బారాముల్లాలో టెర్రరిస్టుల భారీ డంప్‌ స్వాధీనం.. పాక్, చైనా ఆయుధాలు లభ్యం..

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను భారత సైన్యం తిప్పికొట్టి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్‌లో ఉగ్రవాదుల భారీ డంప్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. బారాముల్లాలో టెర్రరిస్టుల భారీ డంప్‌ స్వాధీనం.. పాక్, చైనా ఆయుధాలు లభ్యం..
Jammu And Kashmir
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2022 | 3:15 PM

Share

జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నమయ్యింది. ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను భారత సైన్యం తిప్పికొట్టి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్‌లో ఉగ్రవాదుల భారీ డంప్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీలోని హత్‌లంగా సెక్టార్‌లో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో శనివారం ఉగ్రవాదుల భారీ డంప్‌ లభ్యమైనట్లు భద్రతా దళాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తనిఖీల్లో 8 AK-74U రైఫిళ్లు, 24 AK-74 మ్యాగజైన్స్, 12 చైనీస్ పిస్టల్, 24 పిస్టల్ మ్యాగజైన్‌లు, 9 చైనీస్ గ్రెనేడ్లు, 5 పాక్ గ్రెనేడ్లు, 5 గోధుమ సంచులు, 81 పాక్ బెలూన్లు, 560 రౌండ్ల ఎకె-47, 244 పిస్టల్స్ బుల్లెట్లు, పాక్‌ జెండాలు, బెలూన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. పాకిస్థాన్‌తోపాటు చైనా పిస్టల్స్‌ లభ్యమవ్వడం కలకలం రేపింది.

ఇదిలాఉంటే.. ఎల్‌వోసీ దగ్గర నుంచి భారీ దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ చేసినట్టు ఆర్మీ గుర్తించింది. చొరబాట్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో చురుకైన ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని బారాముల్లాలోని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల సంఖ్యను తగ్గించడంలో భద్రతా బలగాలు చాలా వరకు సఫలమయ్యాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మందుగుండు సామగ్రి కొరత ఉండటంతో సరఫరా చేసేందుకు పాక్ కుట్ర పన్నుతుందని వెల్లడించారు. భద్రతా బలగాల కృషి వల్ల ఉగ్రవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

లాంచింగ్ ప్యాడ్‌లపై ఉగ్రవాదులు ఉన్నారనే ప్రశ్నకు ఆర్మీ ఉన్నతాధికారి స్పందిస్తూ.. లాంచింగ్ ప్యాడ్‌లపై ఉగ్రవాదులు ఉన్నారనడానికి కచ్చితమైన సమాచారం లేదని పేర్కొన్నారు. అయితే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి మోహరించిన ఉగ్రవాదులు, దళాలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..