గొడవ పడకుండా వెళ్లిపోవాలన్నందుకు దారుణం.. కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి చంపిన తాగుబోతులు..
మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో తాగుబోతులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఉన్న దుర్మార్గులు కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా చంపారు.

మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో తాగుబోతులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఉన్న దుర్మార్గులు కానిస్టేబుల్‌ను రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా చంపారు. దమోహ్‌లోని SAF క్యాంప్ దగ్గర విధుల్లో ఉన్న సురేంద్రసింగ్ అనే కానిస్టేబుల్‌ను తాగుబోతులు రాళ్లతో కొట్టి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామోహ్ ఎస్‌ఏఎఫ్ ( ప్రత్యేక సాయుధ దళాల) క్యాంప్ బయట గొడవ జరుగుతున్న విషయం తెలుసుకొని కానిస్టేబుల్ సురేంద్రసింగ్ బయటకు వచ్చాడు. తాగుబోతుల గ్యాంగ్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సూచించాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న వారంతా.. కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు. అనంతరం దుండగులు ఆయన్ను కొట్టి.. ఆపై రాళ్లతో దాడి చేశారు. దుండగుల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు 28 ఏళ్ల SAF జవాన్‌ను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. జవాన్‌ను రాళ్లతో కొట్టిన దృశ్యాలు.. అక్కడున్న సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జవాన్‌ను కొట్టిన తర్వాత నిందితులు అతనిపై రాళ్లు రువ్వడం కూడా వీడియోలో కనిపిస్తోంది.




వీడియో..
MP : दमोह में SAF जवान की पत्थरों से मार कर हत्या की गई, 3 हुए गिरफ़्तार
Damoh | #Damoh pic.twitter.com/nEbPW4142L
— News24 (@news24tvchannel) December 25, 2022
ఘటన అనంతరం పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఞకరు మైనర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




